సాక్షి, తాడేపల్లి: భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి నేడు(డిసెంబర్ 6). ఈ సందర్భాన్ని పురస్కరించుకుని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఘనంగా నివాళులర్పించారు.
నిజమైన దేశనిర్మాణం అంటే ప్రజలకు అవకాశాలు, హక్కులు, గౌరవం ఇవ్వడం అని.. వాటిని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప మేధావి భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని గుర్తు చేశారు. ఆ స్ఫూర్తితో అణగారిన వర్గాల ఆశలను రాజ్యాంగంగా మలిచిన దార్శనికుడాయన అంటూ ఎక్స్ వేదికగా వైఎస్ జగన్ నివాళులర్పించారు.
నిజమైన దేశనిర్మాణం అంటే ప్రజలకు అవకాశాలు, హక్కులు, గౌరవం ఇవ్వడం అని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప మేధావి భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు. ఆ స్ఫూర్తి తో అణగారిన వర్గాల ఆశలను రాజ్యాంగంగా మలిచిన దార్శనికుడు అయన. నేడు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా… pic.twitter.com/DgzRgrdHnC
— YS Jagan Mohan Reddy (@ysjagan) December 6, 2025
బీఆర్ అంబేద్కర్‌ను సమానత్వం, సాధికారత, సామాజిక న్యాయంకు ప్రతీకగా భావిస్తూ వైఎస్సార్‌సీపీ హయాంలో వైఎస్ జగన్ గౌరవిస్తూ పలు కార్యక్రమాలు చేపట్టారు. అంబేద్కర్ స్ఫూర్తిని ప్రతిబింబించే విధానాలను ఏపీలో అమలు చేశారు. విజయవాడలో స్వరాజ్ మైదానంలో స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ పేరుతో ఏకంగా 206 అడుగుల ఎత్తైన భారీ అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించారు. ప్రపంచంలోనే ఇది అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం కావడం గమనార్హం. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ స్మృతి వనాన్ని నిర్లక్ష్యం చేస్తూ అంబేద్కర్‌ను అవమానిస్తోంది. నిర్వహణ భారం పేరిట ప్రైవేట్‌వ్యక్తులకు అప్పగించే ప్రయత్నాలు చేస్తోంది.


