పార్వతీపురం మన్యం: పార్వతీపురం మన్యం జిల్లాలో వైఎస్సార్‌సీపీ నాయకురాలు, మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి చంద్రబాబు పై మండిపడ్డారు.
పుష్పశ్రీవాణి మాట్లాడుతూ.. చంద్రబాబు మొదటి సారి మన్యం జిల్లాకు వచ్చారు. జిల్లాలో పెండింగ్ ప్రాజెక్ట్ లకు నిధులు విడుదల అవుతాయని ప్రజలు ఆశించారు. జిల్లా అభివృద్ధికి కొత్త ప్రాజెక్టులు ప్రకటిస్తారని అనుకున్నారు. కానీ అలాంటివి ఏమీ మాట్లాడలేదు.
పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ వలన జిల్లా ప్రజలకు ఏం ఉపయోగం లేదు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఒక్క స్కూల్ తరగతి గది కూడా కట్టలేదు. ఒక్క టేబుల్ కుర్చీ కూడా ఇవ్వలేదు. అందుకే క్లాస్ రూమ్ సెట్ వేసుకొని కార్యక్రమం చేసుకోవాల్సి వచ్చింది.
ఈ ప్రభుత్వంలో విద్యా రంగానికి ఏం చేస్తున్నారో చెప్పలేక పోయారు. వైఎస్ జగన్ కట్టించిన స్కూల్‌లో కార్యక్రమం చేస్తే స్కూల్స్ అభివృద్ధి కనిపిస్తుందని సినిమా సెట్ వేసుకొని వారి దుర్బుద్ధిని బయట పెట్టుకున్నారు.
వైఎస్ జగన్ పాలనలోని పథకాల పేర్లు మార్చడం తప్ప ఈ ప్రభుత్వం ఒక్క పథకం అయినా తెచ్చిందా. విద్యారంగాన్ని ఈ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని పుష్పశ్రీవాణి పేర్కొంది .


