
కొరియోగ్రాఫర్ ధన శ్రీ వర్మ గురించి పరిచయం చేయాల్సిన పనిలేదు. టీమిండియా క్రికెటర్ చాహల్ను పెళ్లాడిన తర్వాత ఆమెకు మరింత ఫేమస్ అయింది. అయితే వీరిబంధం ఎక్కువరోజులు నిలవలేదు. మనస్పర్థలు రావడంతో ఈ ఏడాదిలో అధికారికంగా విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ధనశ్రీ వర్మ తన కెరీర్పై ఫోకస్ చేస్తోంది. ప్రస్తుతం ‘రైజ్ అండ్ ఫాల్’ అనే రియాలిటీ షోలో ఆమె కంటెస్టెంట్గా పాల్గొన్నారు.
ఈ రియాలిటీ షో పాల్గొన్న ధనశ్రీ వర్మ.. చాహల్తో పెళ్లి.. ఆ తర్వాత విడాకులపై చాలా సార్లు క్లారిటీ ఇచ్చింది. తనపై వచ్చిన రూమర్స్పై సైతం స్పందించింది. విడాకుల సమయంలో చాహల్ను దాదాపు రూ.60 భరణం కోరిందని పలు కథనాలొచ్చాయి. ఈ వార్తలు సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరలయ్యాయి. తాజాగా తనపై వచ్చిన కథనాలపై ధనశ్రీ వర్మ స్పందించింది. తనపై వచ్చిన కథనాలన్నీ అవాస్తవాలేనని కొట్టి పారేసింది. మేమిద్దరం పరస్పర అంగీకారంతోనే విడిపోయామని తెలిపింది.
భరణంపై ధనశ్రీ వర్మ మాట్లాడుతూ..'మేం పరస్పర అంగీకారంతో విడిపోయాం. అందుకే మాకు త్వరగా విడాకులొచ్చాయి. నేను ఈ విషయంలో సైలెంట్గా ఉన్నా. అందుకే ఎవరికీ నచ్చింది వారు రాసుకున్నారు. అలాంటి ప్రచారంపై స్పందిస్తే.. టైమ్ వేస్ట్. కానీ నాపై పెద్దఎత్తున భరణం తీసుకుంటున్నానని వార్తలు చూసి బాధపడ్డా. అయినప్పటికీ ఇప్పటికీ కూడా చాహల్‌ను గౌరవిస్తా' అని అన్నారు. కాగా.. ధనశ్రీ వర్మ- చాహల్ 2020 డిసెంబర్‌లో వివాహం చేసుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో అఫీషియల్గా విడాకులు తీసుకున్నారు. అయితే విడాకుల తర్వాత ధన శ్రీ వర్మ రూ.4.5 కోట్ల భరణం తీసుకున్న సంగతి తెలిసిందే.