ప్రభాస్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా సినిమాల్లో స్పిరిట్ ఒకటి. దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా నాలుగేళ్ల క్రితమే ఈ ప్రాజెక్టును ప్రకటించగా కొద్దిరోజుల క్రితమే షూటింగ్ మొదలుపెట్టారు. ఆ మధ్య ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఓ చిన్నపాటి గ్లింప్స్ వీడియో రిలీజ్ చేశారు. ఇప్పుడేమో కొత్త ఏడాది 2026కి స్వాగతం పలుకుతూ డార్లింగ్ ఫ్యాన్స్‌కు ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చాడు సందీప్ రెడ్డి వంగా.
మందు గ్లాసుతో ప్రభాస్
"ఇండియన్ సినిమా... మీ ఆజానుబాహుడిని చూడు" అంటూ సోషల్ మీడియాలో స్పిరిట్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశాడు. పొడవు జుట్టు, గుబురు గడ్డంతో నల్ల కళ్లద్దాలు పెట్టుకుని ఓ చేత్తో మందు గ్లాసు పట్టుకుని నిల్చున్నాడు. ఒంటినిండా గాయాలతో ఉన్న ప్రభాస్ నోట్లో సిగరెట్ పెట్టుకోగా.. ఎదుట నిల్చున్న తృప్తి డిమ్రి లైటర్ వెలిగిస్తోంది. ఈ పోస్టర్‌లో ప్రభాస్‌ను షర్ట్ లేకుండా చూపించారు. కాకపోతే బ్యాక్‌సైడ్ లుక్‌ను మాత్రమే రివీల్ చేశారు.
రెబల్ లుక్
ఒంటి నిండా గాయాలు, కట్లతో ఉన్న ప్రభాస్(Prabhas) ను చూస్తుంటే స్పిరిట్ ఎంత వైల్డ్‌గా ఉండబోతుందనేది ఇట్టే అర్థమవుతుంది. స్పిరిట్ మూవీలో ప్రకాశ్ రాజ్, వివేక్ ఒబెరాయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. భద్రకాళి పిక్చర్స్ ప్రొడక్షన్స్, టి.సిరీస్ ఫిలింస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నాడు.
Beyond inspiration || Beyond aspiration || Into creation👆🏼#SpiritFirstLook #OneBadHabit #Prabhas @imvangasandeep @tripti_dimri23 @vivekoberoi @InSpiritMode @bnaveenkalyan1 @rameemusic @sureshsrajan #BhushanKumar #KrishanKumar @ShivChanana @neerajkalyan_24 @sivadow55122… pic.twitter.com/2slHYLnFy3
— Bhadrakali Pictures (@VangaPictures) December 31, 2025


