సృజన ప్రొడక్షన్స్, ఈషా ఫిల్మ్స్ బ్యానర్లపై బి.వెంకటేశ్వరరావు నిర్మాణంలో రాజేష్ ధృవ దర్శకత్వం వహిస్తున్న సినిమా 'భూతం ప్రేతం'. యాదమ్మ రాజు, బిందాస్ భాస్కర్, ఇమాన్యుయేల్, బల్వీర్ సింగ్, గడ్డం నవీన్, రాజేష్ ధృవ, రాధిక అచ్యుత రావు తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఇప్పటికే పోస్టర్లు, గ్లింప్స్ రిలీజ్ చేయగా రెస్పాన్స్ బాగుంది.
ఇప్పుడు న్యూఇయర్ సందర్భంగా పార్టీ సాంగ్ రిలీజ్ చేశారు. 'చికెన్ పార్టీ' అంటూ సాగే ఈ పాటని రాజేష్ ధృవ రాయగా.. అనిరుధ్ శాస్త్రి పాడారు. గిరీష్ హోతుర్ ఇచ్చిన బాణీ.. పార్టీ మూడ్‌కు తగ్గట్టుగా ఉంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే సినిమా రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు. ఈ సినిమాకు యోగేష్ గౌడ సినిమాటోగ్రాఫర్, ఉజ్వల్ చంద్ర ఎడిటర్, దేవి ప్రకాష్.ఎస్ ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు.


