స్టార్‌ హీరోలను కాదని.. కోతితో దర్శకుడి సినిమా! | AR Murugadoss New Movie with Monkey | Sakshi
Sakshi News home page

వరుస అపజయాలు.. కోతితో దర్శకుడి సినిమా!

Jan 1 2026 8:35 AM | Updated on Jan 1 2026 8:35 AM

AR Murugadoss New Movie with Monkey

అజిత్‌, విజయ్‌కాంత్‌, సూర్య, ఆమిర్‌ ఖాన్‌, విజయ్‌, రజనీకాంత్‌, శివకార్తికేయన్‌ వంటి స్టార్‌ హీరోలతో సినిమాలు చేశాడు దర్శకుడు ఏఆర్‌ మురుగదాస్‌. అయితే ఇటీవల ఆయన డైరెక్ట్‌ చేసిన సినిమాలు ప్రేక్షకులను అలరించలేకపోయాయి. ముఖ్యంగా రజనీకాంత్‌ హీరోగా ఏఆర్‌ మురుగదాస్‌ తెరకెక్కించిన దర్బార్‌ చిత్రం పూర్తిగా నిరాశపర్చింది.

వరుస అపజయాలు
అలాగే హిందీలో సల్మాన్‌ ఖాన్‌ హీరోగా నటించిన సికిందర్‌ అపజయంపాలైంది. కొంచెం గ్యాప్‌ తర్వాత శివకార్తికేయన్‌ హీరోగా చేసిన మదరాసి కూడా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. దీంతో ఏఆర్‌ మురుగదాస్‌ నెక్స్ట్‌ సినిమా ఏంటన్న ఆసక్తి నెలకొంది.

ఎప్పుడో అనుకున్నా..
అయితే ఈసారి స్టార్‌ హీరోలను కాకుండా ఒక వానరాన్ని నమ్ముకున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఓ భేటీలో పేర్కొన్నారు. తన నెక్స్ట్‌ సినిమాలో కోతి ప్రధాన పాత్రలో నటించనున్నట్లు తెలిపారు. కాకపోతే ఆ కోతి గ్రాఫిక్స్‌లో రూపొందించనున్నామన్నారు. తాను సహాయ దర్శకుడిగా పనిచేస్తున్న సమయంలోనే ఈ కథతో సినిమా చేయాలని భావించానని, ఇది బాలల ఇతివృత్తంతో రూపొందే సినిమాగా ఉంటుందన్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement