సామాన్యులైనా సెలబ్రిటీలైనా పెళ్లి చేసుకున్న తర్వాత అప్పుడో ఇప్పుడో పిల్లల్ని ప్లాన్ చేసుకుంటారు. ప్రస్తుత కాలంలో చాలామంది పిల్లల్ని వద్దనుకుంటున్నారు. ఎవరి కారణాలు వాళ్లకు ఉన్నాయి. ఇప్పుడు నటి వరలక్ష‍్మి కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేసింది. తనకు అసలు పిల్లల్ని కనాలనే ఆలోచన లేదని కుండబద్దలు కొట్టేసింది. అందుకు గల కారణాన్ని కూడా బయటపెట్టింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అమ్మతనం గురించి చెప్పింది.
'అమ్మతనం అనేది చాలా పెద్ద బాధ్యత. పిలల్ని కన్నంత మాత్రాన తల్లి అయిపోలేరు. ఎందుకంటే నేను నా చెల్లికి తల్లిగా ఉంటాను. నా పెంపుడు కుక్కలకు తల్లిగా వ్యవహరిస్తా. నా స్నేహితులని తల్లిలా చూసుకుంటా. సాయం కావాల్సిన వాళ్లకు తల్లిగా తోడుంటా. నా వరకు అమ్మతనం అంటే అర్థమిదే. నాకు వ్యక్తిగతంగా అయితే పిల్లల్ని కనాలనే ఆలోచన లేదు. భవిష్యత్‌లో ఏమైనా జరగొచ్చు. ఎందుకంటే ఒకానొక సందర్భంలో అసలు పెళ్లే వద్దనుకున్నాను. అలానే పిల్లల్ని వద్దనుకునే చాలామంది.. వాళ్లు తీసుకున్న మంచి నిర్ణయం అదే' అని వరలక్ష‍్మి తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చింది.
(ఇదీ చదవండి: అమ్మనాన్న విడాకులు.. రాధికనే కారణమని తిట్టుకున్నా: వరలక్ష్మి)
సీనియర్ నటుడు శరత్ కుమార్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి వచ్చిన వరలక్ష‍్మి.. ప్రారంభంలో హీరోయిన్‌గా చేసింది. పెద్దగా వర్కౌట్ కాకపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారింది. ప్రస్తుతం తెలుగు, తమిళంలో మంచి మంచి పాత్రలు చేస్తూ అలరిస్తోంది. హీరో విశాల్‌తో ఈమెకు పెళ్లని కొన్నాళ్ల ముందు వార్తలొచ్చాయి. వాటికి చెక్ పెడుతూ గతేడాది నికోలాయ్ సచ్‌దేవ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఓవైపు యాక్టింగ్, మరోవైపు ఫ్యామిలీ లైఫ్‌తో వరలక్ష‍్మి బిజీగా ఉంది.
వరలక్ష‍్మి పిల్లల్ని వద్దని అనుకోవడంపై చాలా కారణాలే ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే తాను చిన్నతంలో లైంగిక వేధింపులకు గురయ్యానని గతంలో ఓ షోలో చెప్పింది. ఐదారుగురు తనని ఇబ్బంది పెట్టారనే విషయం బయటపెట్టింది. అలానే ఈమెకు ఊహ తెలిసొచ్చిన తర్వాత తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. ఈమె తల్లి ఛాయాదేవి నుంచి విడిపోయిన తర్వాత శరత్ కుమార్, నటి రాధికని పెళ్లిచేసుకున్నారు. ఒకవేళ పిల్లల్ని కంటే తనలా ఎక్కడ ఇబ్బంది పడతారోనని వరలక్ష‍్మి ఆలోచిస్తున్నట్లు ఉంది. అందుకే ఈ వ్యాఖ్యలు చేసిందా అనిపిస్తుంది.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన మలయాళ థ్రిల్లర్.. తెలుగు వెర్షన్ ఎప్పుడంటే?)


