అమ్మనాన్న విడాకులు.. రాధికనే కారణమని తిట్టుకున్నా: వరలక్ష్మి | Varalakshmi Sarathkumar Once Blame Radhika For Parents Divorce | Sakshi
Sakshi News home page

Varalakshmi Sarathkumar: నాన్న రెండో పెళ్లి.. నాకు చాలా కోపం వచ్చింది

Dec 31 2025 5:10 PM | Updated on Dec 31 2025 5:18 PM

Varalakshmi Sarathkumar Once Blame Radhika For Parents Divorce

తమిళ సీనియర్ నటుడు శరత్ కుమార్.. తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. ఈయన కూతురు వరలక్ష‍్మి కూడా టాలీవుడ్‌లో ఎప్పటికప్పుడు ఏదో సినిమాలో కనిపిస్తూనే ఉంటుంది. శరత్ కుమార్ వ్యక్తిగత జీవితం గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ఛాయాదేవిని మొదట పెళ్లి చేసుకోగా.. వరలక్ష‍్మి పుట్టింది. కానీ కొన్నాళ్లకు వైవాహిక బంధంలో సమస్యలొచ్చి శరత్ కుమార్ తొలి భార్యకు విడాకులిచ్చేశాడు. తర్వాత నటి రాధికని పెళ్లి చేసుకున్నాడు. అయితే తన తల్లిదండ్రులు విడిపోవడానికి రాధికనే కారణమని అప్పట్లో ఆమెని చాలా తిట్టుకున్నానని వరలక్ష‍్మి చెప్పింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.

'చాన్నాళ్ల క్రితమే ఆయన్ని(శరత్ కుమార్) క్షమించేశా. నేను థెరపీ చేయించుకుంటున్న టైంలో ఈ విషయాన్ని తెలుసుకున్నాను. కొన్నిసార్లు ఇద్దరు మనుషులు కలిసుండే పరిస్థితులు ఉండకపోవచ్చు. నా వరకు నాన్నంటే నాన్నే. ఆయన నాకు బయలాజికల్ తండ్రి కాబట్టి కచ్చితంగా గౌరవిస్తా. కాకపోతే అమ్మ-నాన్న విడిపోవడం నాకు చాలా కోపం తెప్పించిన విషయం. ఆయన మరో పెళ్లి చేసుకోవడం మరింత కోపానికి కారణమైంది. కాలక్రమేణా అది తగ్గిపోయింది. విడాకులు విషయంలో అమ్మనాన్న సరైన నిర్ణయమే తీసుకున్నారు. ఎందుకంటే అలా చేయడం వల్ల ఇప్పుడు ఇద్దరూ ఆనందంగా ఉన్నారు' అని తండ్రి గురించి వరలక్ష్మి చెప్పుకొచ్చింది.

(ఇదీ చదవండి: సమంత హనీమూన్ ట్రిప్.. ఫొటోలు వైరల్!)

రాధిక గురించి మాట్లాడుతూ.. 'చాలామంది ఆమె వచ్చి.. అమ్మనాన్న బంధాన్ని చెడగొట్టిందని అనుకుంటారు. కానీ నా తల్లిదండ్రుల విడాకులకు ఆమె కారణం కాదు. మీరు(రాధికతో) ఇంత అన్యోన్యంగా ఎలా ఉండగలుగుతున్నారు? అని కూడా చాలామంది నన్ను అడుగుతుంటారు. మా అమ్మనాన్న విడాకులకు ఆమె కారణం కాదు కాబట్టి అని నేను చెబుతుంటాను. ఆంటీ(రాధిక) వచ్చేసరికే అమ్మనాన్న వైవాహిక బంధంలో సమస్యలున్నాయి. ఆమె(రాధిక) నాన్న జీవితంలోకి వచ్చిన కొత్తలో.. ఆమెతో పెద్దగా నాకు సత్సంబంధాలు ఉండేవి కావు. నా తల్లిదండ్రుల విడాకులకు కారణం ఆమెనే అనుకోవడం దీనికి కారణం. కాస్త పెద్దయ్యాక అన్ని విషయాలు అర్థమయ్యాయి. ప్రస్తుతం ఆంటీతో నాకు మంచి రిలేషన్ ఉంది. అమ్మతో కూడా ఆమెకు మంచి రిలేషనే ఉంది' అని వరలక్ష్మి క్లారిటీ ఇచ్చింది.

గతంలో కూడా ఓసారి మాట్లాడిన వరలక్ష‍్మి.. తండ్రి శరత్ కుమార్ రెండో పెళ్లి చేసుకున్న రాధిక, తనకు ఆంటీ మాత్రమే అని.. తాను ఆమెని అలానే పిలుస్తానని చెప్పింది. ఆమె తనకు అమ్మ కాదని కూడా క్లారిటీ ఇచ్చింది. రాధిక సవతి తల్లినే అయినప్పటికీ ప్రస్తుతం వరలక్ష్మితో మంచి బాండింగ్ మెంటైన్ చేస్తోంది. వరలక్ష‍్మి పెళ్లి కూడా దగ్గరుండి జరిపించింది.

(ఇదీ చదవండి: 'అవతార్ 3' విలన్ చార్లీ చాప్లిన్ మనవరాలా?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement