పదిరోజుల క్రితం థియేటర్లలో వచ్చిన హాలీవుడ్ భారీ బడ్జెట్ మూవీ 'అవతార్ 3'.. భారత్‍లో అంతంత మాత్రంగానే ఆడింది. తొలి రెండు భాగాలతో పోలిస్తే స్టోరీపై విమర్శలు వచ్చాయి. విజువల్ ఎఫెక్ట్స్ బాగున్నాయనే ప్రశంసలు వచ్చినప్పటికీ ఓవరాల్ టాక్ మాత్రం ఏమంత గొప్పగా అయితే లేదు. సరే టాక్, కలెక్షన్స్ గురించి పక్కనబెడితే ఇందులో విలన్‌గా చేసిన నటి.. దిగ్గజ కమెడియన్ చార్లీ చాప్లిన్ మనవరాలు అనే విషయం ఆసక్తికరంగా అనిపిస్తోంది.
1950,60ల్లో మూకీ కామెడీతో చాలా గుర్తింపు తెచ్చుకున్న చార్లీ చాప్లిన్.. ఇప్పటి తరంలోనూ చాలామందికి తెలుసు. అయితే ఈయన తర్వాత కుటుంబ సభ్యులెవరైనా యాక్టర్స్ అయ్యారా? ఏదైనా సినిమాలు చేశారా? అనేది పెద్దగా వెలుగులోకి రాలేదు. అయితే 'అవతార్ 3'లో విలన్ వరంగ్ పాత్రలో చేసిన ఊనా చాప్లీన్.. ఆయనకు మనవరాలి అనే విషయం తెలిసి అంతా ఆశ్చర్యపోతున్నారు.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన మలయాళ థ్రిల్లర్.. తెలుగు వెర్షన్ వాయిదా)
ఊనా చాన్నాళ్లుగా యాక్టింగ్ చేస్తోంది. 2007 నుంచి సినిమాలు, వెబ్ సిరీస్‌ల్లో సహాయ పాత్రలు చేస్తోంది. కాకపోతే పెద్దగా ఫేమ్ లాంటిది దక్కలేదు. ఓటీటీల్లో క్లాసిక్ సిరీస్ అయిన 'గేమ్ ఆఫ్ థ్రోన్స్'లోనూ స్టార్క్ రాజు పెద్ద కొడుకు భార్యగా టలీషా స్టార్క్ పాత్రలో కొన్ని ఎపిసోడ్స్ కనిపిస్తుంది. చిన్న పాత్రనే అయినప్పటికీ గుర్తుండిపోయింది. దీనితో పాటు చాలా మూవీస్, సిరీస్‌లు చేసినప్పటికీ మళ్లీ ఇన్నాళ్లకు 'అవతార్ 3'లో విలన్ రోల్ వల్ల సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.
చార్లీ చాప్లిన్ కూతురు గెరాల్డైన్. ఈమె పుట్టింది ఊనా చాప్లిన్. తాత, అమ్మలానే యాక్టర్ అయింది. తాత కామెడీతో నవ్విస్తుంటే మనవరాలు మాత్రం విలనిజంతో భయపెడుతోంది.
(ఇదీ చదవండి: ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ మూవీ రివ్యూ)


