రెబల్ స్టార్ ప్రభాస్ 'ది రాజాసాబ్' సినిమాతో 2026కి స్వాగతం పలుకుతున్నాడు. మారుతి దర్శకత్వం వహించిన ఈ హారర్ మూవీ జనవరి 9న విడుదల కానుంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, సాంగ్స్‌తో సోషల్‌మీడియాలో మంచి హైప్ వచ్చింది. కొత్త ఏడాది సందర్భంగా ది రాజాసాబ్ నుంచి ఓ సర్‌ప్రైజ్ వదిలారు.
రాజే యువరాజే సాంగ్
'రాజే యువరాజే' పాటను రిలీజ్ చేశారు. ఎటువంటి విజువల్స్ లేకుండా కేవలం ఆడియో సాంగ్ మాత్రమే బయటకు వదిలారు. తమన్ సంగీతం అందించిన ఈ పాటను అద్వితీయ వొజ్జల, బేబీ రియా సీపన ఆలపించారు. కృష్ణకాంత్ లిరిక్స్ సమకూర్చారు. ఇకపోతే ఈ చిత్రంలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఒకేరోజు రెండు సర్‌ప్రైజ్‌లు
కాగా ప్రభాస్ నటిస్తున్న మరో పాన్ ఇండియా చిత్రం స్పిరిట్. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ వదిలారు. అందులో డార్లింగ్ ప్రభాస్ ఒంటి నిండా గాయాలు, కట్లతో కనిపించాడు. అయితే ప్రభాస్‌ను ముందువైపు నుంచి చూపించకుండా బ్యాక్‌సైడ్ ఫోటో మాత్రమే వదిలారు. దెబ్బలతో ఉన్న ప్రభాస్ ఓపక్క సిగరెట్, మరోపక్క మందు తాగుతున్నట్లుగా ఆ పోస్టర్ ఉంది. ఇది చూసిన డార్లింగ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.


