టీమిండియా వెటరన్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ మరోసారి వార్తల్లోకెక్కాడు. అతడి ప్రియురాలిగా ప్రచారంలో ఉన్న ఆర్జే మహ్‌వశ్‌తో చహల్‌కు విభేదాలు తలెత్తాయనేది ఆ వార్తల సారాంశం. కొరియోగ్రాఫర్, యూట్యూబర్ ధనశ్రీ వర్మను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు చహల్.
అయితే, వివాహమైన కొన్ని నెలలకే తమ మధ్య గొడవలు జరిగాయని.. విడాకులు తీసుకోవడమే ఉత్తమమని భావించినట్లు కోర్టును ఆశ్రయించింది ఈ జంట. గతేడాది అధికారికంగా వీరికి విడాకులు మంజూరయ్యాయి.
ఆర్జేతో చెట్టాపట్టాల్
కానీ అంతకంటే ముందు నుంచే చహల్.. ఆర్జే మహ్‌వశ్ (RJ Mahvash)తో కలిసి చక్కర్లు కొడుతున్న వీడియోలు వైరల్ అయ్యాయి. చాంపియన్స్ ట్రోఫీ-2025 సందర్భంగా ఆమెతో కలిసి మ్యాచ్‌ను వీక్షిస్తున్న ఫొటోలు షేర్ చేసి తమ మధ్య స్నేహ బంధం ఉందని చహల్ స్పష్టం చేశాడు.
కాపురాన్ని ఆమే కూల్చేసిందని..
ఈ ఘటన తర్వాత కొన్నాళ్లకే చహల్- ధనశ్రీలకు విడాకులు మంజూరు కావడంతో.. అప్పటిదాకా ధనశ్రీని తిట్టినవారంతా ఆర్జే మహ్‌వశ్‌పై దృష్టి సారించారు. చహల్ కాపురాన్ని ఆమే కూల్చేసిందని.. భార్యభర్తల మధ్య దూరి విడాకులకు కారణమైందని పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు.
మరోవైపు.. చహల్‌కు మద్దతుగా పరోక్షంగా ధనశ్రీని టార్గెట్ చేస్తూ మహ్‌వశ్ సైతం పోస్టులు పెట్టింది. దీంతో నెటిజన్లు మరోసారి ‘‘హోం బ్రేకర్’’ అంటూ ఆమెపై విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో ఇటీవల చహల్ ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. ‘‘ఓ అమ్మాయి, అబ్బాయి కలిసి కనిపిస్తే చాలు వదంతులు వ్యాప్తి చేస్తారు.

ఏడుస్తూ కూర్చోలేము కదా!
అంతమాత్రాన మేము ఏడుస్తూ కూర్చోలేము కదా!.. జనాలు ఏమనుకుంటున్నారో అదే అనుకోనివ్వండి. మాకేం తేడా ఉండదు. మా కాపురాన్ని కూల్చిందని ఆమెను ఆడిపోసుకున్నారు. ఇంకా ఎన్నెన్నో మాటలు అన్నారు. ఓ మహిళను ఎన్ని రకాలుగా కించపరచవచ్చో అన్ని రకాలుగా మాట్లాడారు.
యుజీ ఆమెతో ఎందుకు ఉన్నాడని చాలా మంది అన్నారు. కష్టకాలంలో నాకు సహాయంగా నిలబడ్డ నా స్నేహితురాలిని అలా నిందించడం నాకు బాధ కలిగించింది. ఫ్రెండ్స్ అందరితో కలిసి వెళ్లినా మా ఫొటోలు మాత్రమే క్రాప్ చేసి రూమర్స్ వ్యాప్తి చేశారు. అందుకే కలిసి బయటకు వెళ్లడం కూడా మానేశాము’’ అని చెప్పుకొచ్చాడు.
ఒకరినొకరు అన్‌ఫాలో
మరోవైపు.. ఆర్జే మహ్‌వశ్ సైతం అబ్బాయితో కలిసి బయటకు వెళ్తే చాలు డేటింగ్ అంటున్నారని.. అసలు మనం ఏ కాలంలో ఉన్నామంటూ మండిపడింది. పరోక్షంగా చహల్‌తో తనకు స్నేహం మాత్రమే ఉందని స్పష్టం చేసింది. అయితే, తాజాగా వీరిద్దరు సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడం గమనార్హం.

నేను ఎవరినీ నమ్మను
దీంతో చహల్- మహ్‌వశ్ మధ్య విభేదాలు తలెత్తి విడిపోయారంటూ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు చహల్ ఇన్‌స్టా స్టోరీలో.. ‘‘నేను ఎవరినీ నమ్మను’’ అని పోస్ట్ పెట్టడం ఇందుకు బలమిచ్చింది.
మరో స్టోరీలో ‘‘బాధ, ఆశల వలయంలో చిక్కుకుపోకుండా.. బంధాల్లో మునిగిపోకుండా.. కోపం, భయాన్ని వదిలేసి ముందుకు సాగేవాడే తెలివైన మనిషి’’ అన్న భవద్గీత పంక్తులను కూడా చహల్ షేర్ చేయడం విశేషం.


