విడాకుల గురించి తొలిసారి స్పందించిన విజయ్ | Actor Vijay Reacts Divorce Issue With Sangeetha | Sakshi
Sakshi News home page

Vijay: మీరు కంగారు పడొద్దు.. వాటి సంగతి నేను చూసుకుంటా

Mar 7 2026 7:49 PM | Updated on Mar 7 2026 8:22 PM

Actor Vijay Reacts Divorce Issue With Sangeetha

తమిళ స్టార్ హీరో విజయ్ గురించి గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది. ఇతడి భార్య సంగీత.. కోర్టులో విడాకుల కోసం పిటిషన్ వేయడం, త్రిషతో విజయ్‌కి రిలేషనే ఉందనే రూమర్స్ ఓ వైపు చక్కర్లు కొడుతుండగానే ఓ పెళ్లికి ఆమెతోనే కలిసి రావడం లాంటివి హాట్ టాపిక్ అయిపోయాయి. అలానే విడాకులు మంజూరు అయ్యేంతవరకు తనని ఇంట్లోనే ఉండనివ్వాలని చెప్పి సంగీత మరో పిటిషన్ వేయడం, భరణంగా రూ.250 కోట్లు ఇవ్వనున్నాడనే కామెంట్స్ చర్చనీయాంశమైపోతున్నాయి. ఇలాంటి టైంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయ్.. తన విడాకులపై తొలిసారి స్పందించాడు.

(ఇదీ చదవండి: బెస్ట్ ఎక్స్ బాయ్‌ఫ్రెండ్‌ని.. బ్రేకప్ తర్వాత చాలా ఏడ్చా: షణ్ముఖ్ జస్వంత్)

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విజయ్.. తన టీవీకే పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించారు. తాము అధికారంలోకి వస్తే ఇవ్వబోయే సూపర్ సిక్స్ పథకాల గురించి వివరించారు. వీటితో పాటు తన విడాకుల వ్యవహారం గురించి కూడా పరోక్షంగా విజయ్ మాట్లాడారు.

'నా జీవితంలో జరుగుతున్న పలు సంఘటనల గురించి మీరు కంగారు పడకండి. వాటి గురించి ఆలోచించి మీరు సమయాన్ని వృథా చేసుకోవద్దు. వాటిని నేను పరిష్కరించుకుంటాను. నా సమస్యల గురించి ఆలోచిస్తూ మీరు ఒత్తిడికి లోనవడం నన్ను మరింతగా బాధపెడుతోంది' అని విజయ్.. తన విడాకుల గురించి ఇన్ డైరెక్ట్‌గా మాట్లాడారు. ఇప్పుడీ వ్యాఖ్యలు, వీడియో వైరల్ అవుతున్నాయి.

(ఇదీ చదవండి: 'ధురంధర్ 2'ని చూసి టాలీవుడ్ చాలా నేర్చుకోవాలి!)

Advertisement
 
Advertisement
Advertisement