ఆ రోజు రాత్రే ప్రియాంకకు ‘ఫ్రెంచ్ కిస్’.. సీక్రెట్స్ బయటపెట్టిన నిక్ జోనాస్ | Nick Jonas Recalls Steamy First Date With Priyanka Chopra | Sakshi
Sakshi News home page

ప్రియాంకతో ఫస్ట్ డేట్‌: ఆ రోజు రాత్రి ఏం జరిగిందంటే.. : నిక్ జోనాస్

Mar 7 2026 6:05 PM | Updated on Mar 7 2026 6:16 PM

Nick Jonas Recalls Steamy First Date With Priyanka Chopra

ప్రియాంకతో తొలి డేట్ జ్ఞాపకాలను పంచుకున్న నిక్ జోనాస్

ప్రియాంక చోప్రా-నిక్ జోనాస్ జంటకు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఫాలోయింగ్‌ ఉంది. ఏ విషయంలో అయినా వీరిద్దరు చాలా ఓపెన్‌గా మాట్లాడతారు. పర్సనల్‌ విషయాలను కూడా షేర్‌ చేసుకుంటారు. అందుకే ఈ జంటపై నిత్యం ఏదో ఒక వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతూనే ఉంటుంది. తాజాగా నిక్ జోనాస్ ఒక ఇంటర్వ్యూలో తమ మొదటి డేటింగ్‌కు సంబంధించిన కొన్ని మధుర జ్ఞాపకాలను అభిమానులతో పంచుకున్నారు. ఆ విశేషాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

నిక్‌ జోనాస్‌ తన మొదటి డేటింగ్‌ అనుభవం గురించి చెబుతూ.. ‘మా మొదటి డేటింగ్‌ చాలా విచిత్రంగా జరిగింది. అందరిలాగా మేం ఒంటరిగా డేటింగ్‌కి వెళ్లలేదు. ప్రియాంక తన స్నేహితురాలితో వస్తే..నేను మా సోదరుడిని తీసుకొని వెళ్లాను. ఈ డేట్‌ ప్లాన్‌ చేసింది ప్రియాంకనే. మొదట ఓ మ్యూజిక్‌ లైవ్‌ కాన్సర్ట్‌కి వెళ్లాం. అయితే అది ప్రియాంకకు నచ్చలేదు. దీంతో బయటకు వెళ్లాలనుకున్నాం. మాతో పాటు ఇంకో జంట కూడా వచ్చింది. ఆ రోజు సాయంత్రం చాలా ఆనందంగా గడిపాం. 

ఇద్దరం కలిసి డ్రింక్‌ చేయడానికి ఎక్కడికో వెళ్లాం. మేము ఎంత దూరంలో ఉన్న సోదరుడు మా కోసం డ్రింక్స్‌ పంపించి.. దూరంగా వెళ్లిపోయాడు. అంతేకాదు ఆ రోజు టైమ్‌ దొరికినప్పుడల్లా ప్రియాంకకు నా గురించి గొప్పగా చెప్పేందుకు ట్రై చేశాడు. అది ఆమెకు అర్థమై ‘మీ బ్రదర్‌ నీకు బాగానే గ్యాస్‌ కొడుతున్నాడు కదా’ అని నవ్వేసింది. ఇలా ఆ ఈవినింగ్‌ చాలా ఎంజాయ్‌ చేశాం. 

ఇక ఆ రోజు రాత్రి ఎలా గడిపారనే విషయాన్ని చెబుతూ.. ‘ఆ రోజు నైట్‌ మీమిద్దరం 'ఫ్రెంచ్ కిస్' చేసుకున్నామని నిక్‌ చెప్పాడు. ఆ క్షణం తమ ఇద్దరికీ ఎంతో ప్రత్యేకం అని, అప్పుడే తమ మధ్య ప్రేమ చిగురించిందని ఆయన చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని ఆయన ఎంతో నిజాయితీగా పంచుకోవడం అభిమానులను ఆకట్టుకుంటోంది.

కాగా, ప్రియాంక, నిక్‌ల వివాహం 2018లో జరిగింది. ప్రస్తుతం ఈ జంటకి 'మాలతీ మేరీ' అనే కుమార్తె ఉంది. తమ కెరీర్‌లతో బిజీగా ఉంటూనే, కుటుంబానికి కూడా సమాన ప్రాధాన్యత ఇస్తూ ఈ జంట అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement