టీవీకే చీఫ్‌ విజయ్‌ మ్యానిఫెస్టో.. వారికి బంపరాఫర్‌ | Vijays TVK Promises Rs 2 500 for Women Heads, | Sakshi
Sakshi News home page

టీవీకే చీఫ్‌ విజయ్‌ మ్యానిఫెస్టో.. వారికి బంపరాఫర్‌

Mar 7 2026 7:24 PM | Updated on Mar 7 2026 8:11 PM

Vijays TVK Promises Rs 2 500 for Women Heads,

చెన్నై:  త్వరలో తమిళనాడులో  అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో అక్కడ పొలిటికల్‌ హీట్‌ ఊపందుకుంది. తమిళనాడులో కొత్తగా ఆవిర్భించిన విజయ్‌ నేతృత్వంలోని టీవీకే ఎన్నికలకు భారీ హామీలతో ముందుకెళ్లడానికి సిద్ధమైంది. ఈ మేరకు టీవీకే చీఫ్‌ విజయ్‌.. తమ మ్యానిఫెస్టోను ప్రకటించారు. ఇందులో మహిళలకు బంపరాఫర్‌లు ఇచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం(మార్చి 7వ తేదీ) తన ఎన్నికల హామీలను ప్రకటించారు విజయ్‌. 

మహిళలకు నెలకు రూ.2500 ఆర్థిక సహాయం, యువతులకు వివాహ బహుమతిగా బంగారపు ఉంగరం, పట్టు చీరలతో పాటు అన్ని కుటుంబాలకు ఉచితంగా ఆరు ఎల్‌పిజి సిలిండర్లు వంటి అనేక వాగ్దానాలను ప్రకటించారు. తన తమిళగ వెట్రీ కజగం అధికారంలోకి వచ్చినప్పుడు, ప్రభుత్వ ఉద్యోగులకు తప్ప 60 ఏళ్ల వయస్సు వరకు  ఉన్న మహిళలందరికీ  నెలవారీ సహాయం అందించబడుతుందని విజయ్‌ స్పష్టం చేశారు.

మహిళలపై నేరాలకు సంబంధించి జీరో పారదర్శకత విధానాన్ని అమలు చేయడానికి “రాణి వెలు నాచ్చియార్ ఫోర్స్” అనే ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. తమిళనాడులో సుమారు 500 బృందాలను రద్దీ ప్రదేశాల్లో భద్రత కోసం నియమిస్తామన్నారు.  ఈ బృంద సభ్యులు బాడీ కెమెరాలతో  అందుబాటులో ఉంటారన్నారు.

అలాగే, మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులను వేగంగా విచారించి న్యాయం అందించేందుకు “అంజలై అమ్మాళ్ సూపర్ ఫాస్ట్ మహిళా కోర్టులు” ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement