‘పబ్లిసిటీ మాత్రం ఉంటుంది.. ప్రజలకు చేసేదేమీ ఉండదు’ | YSRCP Leader Kurasala Kannababu Slams Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

‘పబ్లిసిటీ మాత్రం ఉంటుంది.. ప్రజలకు చేసేదేమీ ఉండదు’

Mar 7 2026 6:28 PM | Updated on Mar 7 2026 6:39 PM

YSRCP Leader Kurasala Kannababu Slams Chandrababu Naidu

ఏలూరు: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు ప్రజలకు చేసేదేమీ ఉండదని, కేవలం పబ్లిసిటీ కోసమే తపిస్తూ ఉంటారని ధ్వజమెత్తారు. చంద్రబాబు మాటలతో కాలం గడుపుతారని, ప్రజలకు చేసేది మాత్రం శూన్యమని విమర్శించారు. 

ఈరోజు(శనివారం, మార్చి 7వ తేదీ) ఏలూరు జిల్లా వైఎస్సార్‌సీపీ కార్యాలయం నుంచి మాట్లాడిన కురసాల కన్నబాబు.. ‘ కాగ్ నివేదిక చూస్తే.. రాష్ట్ర పరిస్థితి ఎంత దిగజారిపోయిందో కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని చెబితే... చంద్రబాబు మాత్రం ప్రజలను అసెంబ్లీలో మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో అరాచకంగా ఆర్థిక వ్యవస్థ నడిపిస్తున్నారు.. అప్పు చేయని రోజు అంటూ లేదు. యుద్ధాలతో సంక్షోభంలో ఉన్న దేశాల కన్నా... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతకన్నా దారుణమైన స్థితిలో ఉంది. ఆర్బీఐ వద్ద అప్పుచేసి 300 కోట్ల పైనే వడ్డీ కట్టారు. వాహనాల పన్ను జీఎస్టీని కేంద్రం తగ్గిస్తే... అది కూడా రోడ్ టాక్స్ కింద మలిచి ప్రజలపై బారాలు మోపుతున్నారు చంద్రబాబు. ఎఫ్ఆర్ఎంబి చట్టం నిబంధనలను ఉల్లంగించారు చంద్రబాబు

పరిమితికి మించి అప్పులు చేయడం ద్వారా రాష్ట్ర అధోగతి పాలుఅవబోతున్నది.  ఎఫ్ఆర్ఎంబి  లోటు 2.7 శాతం ఉండాల్సింది 3.75 గా ఉంది. మూడు లక్షల 18 వేల కోట్లు రూపాయలు అప్పులు చంద్రబాబు చేసి పెద్ద ఘనతగా చెబుతున్నారు. రాష్ట్రంలో ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు ఆటపాటలతో ఎంజాయ్ చేస్తున్నారు.రాజమండ్రిలో కల్తీ పాలతో ప్రజలు చనిపోతే పట్టించుకోవడం లేదు. 

వేట్లపాలెంలో అనేకమంది చనిపోతే వారి ఊసే పాలకులకు పట్టడం లేదు. శ్రీకాకుళంలో నీరు కలుషితమై ఆరుగురు చనిపోయిన వీరికి పట్టడం లేదు. అసెంబ్లీలో ప్రజాప్రతినిధులు పేదల సమస్యలు చర్చించకుండా... ఏకపాత్రాభినయాలు, పేదల పెన్షన్లపై కూడా స్కిట్లు చేస్తూ ప్రజలను మభ్యపెట్టి గడిపేస్తున్నారు. చంద్రబాబు అప్పులు చేసిన డబ్బు ఏ సంక్షేమ పథకానికి ఖర్చు చేశారు. సూపర్ సిక్స్ హామీలకు ఖర్చు చేశారా చూపండి’ అంటూ సవాల్‌ చేశారు.

‘జగన్‌మోహన్‌రెడ్డిన తట్టుకోవడం కష్టం అని ఒకే ఒక కారణంతో మీరు కలిసి ఉంటున్నారు. జగన్‌పై ఉన్న భయం ఒకటే మిమ్మల్ని కలిపి ఉంచుతుంది. కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్ నీడ్ శాతం 41.8 శాతం తగ్గిపోయింది. కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా నిధులు తీసుకురాలేకపోతున్నారు. అంచనాలే అందుకోలేని విధంగా.... మీ బడ్జెట్ ఉంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు ఇచ్చే గ్రాంట్లు రూ. 10వేల 620 కోట్లు తగ్గిపోయాయి. మూలధన వ్యయం రూ. 45 కోట్లు చేస్తామని రూ. 16 కోట్లు చేశారు. రాష్ట్రం దివాళా తీసే దిశగా ఆర్థిక వ్యవస్థ ఉందని కాగ్ నివేదిక వేదిక చెప్పింది.రెవెన్యూలో లోటు పెరిగిపోయింది...365 రోజుల్లో 364 రోజులు అప్పులు చేసే పరిస్థితికి.. రాష్ట్రాన్ని దిగజార్చారు’ అంటూ విమర్శించారు.

Advertisement
 
Advertisement
Advertisement