
ప్రముఖ కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్‌ను పెళ్లాడారు. 2020లో వివాహబంధంలోకి అడుగుపెట్టిన వీరిద్దరు మనస్పర్థలు రావడంతో ఈ ఏడాది తమ బంధానికి ఎండ్ కార్డ్ పడేశారు. ఫిబ్రవరి అఫీషియల్గా విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి యుజ్వేంద్ర చాహల్ ప్రముఖ ఆర్జే మహ్వశ్తో డేటింగ్ ఉన్నట్లు వార్తలొచ్చాయి. చాలాసార్లు వీరిద్దరు జంటగా కనిపించడంతో రూమర్స్ మొదలయ్యాయి.
అయితే ఇవన్నీ పక్కనపెడితే ప్రస్తుతం ఒంటరిగానే ఉంటోన్న చాహల్ మాజీ భార్య ధనశ్రీ వర్మ రియాలిటీ షో రైజ్ అండ్ ఫాల్‌లో కంటెస్టెంట్గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విడాకుల సమయంలో తనపై వచ్చిన ఆరోపణలపై స్పందించారు. చాహల్ను తాను మోసం చేశానంటూ పలు కథనాలొచ్చాయి. తాజాగా వీటిపై ధనశ్రీ వర్మ రియాక్ట్ అయింది. ఇదంతా నెగెటివ్ పీఆర్లో భాగంగానే చేశారని విమర్శించింది. ఓ ఎపిసోడ్‌లో మరో కంటెస్టెంట్ అర్బాజ్ పటేల్ చాహల్ను ధనశ్రీ మోసం చేసిందని తాను విన్నానని ఆమెతో చెప్పాడు.
దీనిపై ధనశ్రీ స్పందిస్తూ.. 'అలాంటి వాళ్లు నా గురించి ఇలాంటి చెత్త మాటలు వ్యాప్తి చేస్తారు. నేను నోరు తెరుస్తానేమోనని భయపడుతున్నాడు. నా నోరు మూయించడానికే ఇదంతా చేస్తున్నారు. అసలేం జరిగిందో నిజమైన వివరాలు చెబితే.. ఈ షో మీకు మరోలా అనిపిస్తుంది. ఆర్జే మహ్వశ్తో రిలేషన్పై ధనశ్రీ మాట్లాడింది. నాకు చాహల్తో విడాకులు అయిపోయాయి. అతని గాసిప్స్ గురించి నాకు అక్కర్లేదు. నా లైఫ్లో అదొక ముగిసిన అధ్యాయం. పెళ్లి అనే బంధంలో ఉన్నప్పుడు బాధ్యాతాయుతంగా ఉండాలి. ఇతరుల గౌరవాన్ని కూడా మనం కాపాడేలా వ్యవహరించాలి. మన ఇమేజ్ కోసం మరొకరిని ఎందుకు తక్కువ చేయాలి? మీరు నా గురించి ఎంత నెగెటివ్గా మాట్లాడినా దాంతో మీకెలాంటి ఊపయోగం లేదు. మీ టైమ్ వేస్ట్ తప్ప' అని పంచుకుంది.