తెలుగులో కాస్త తక్కువ గానీ బాలీవుడ్‌లో స్టార్స్ హీరోలు, దర్శకులు వెబ్ సిరీస్‌లు చేస్తున్నారు. అలా ఇమ్రాన్ హష్మీ ప్రధానపాత్రలో, నీరజ్ పాండే దర్శకత్వం వహించిన సిరీస్ 'టస్కరీ'. తాజాగా టీజర్ రిలీజ్ చేయడంతో పాటు స్ట్రీమింగ్ ఎప్పుడనేది కూడా ప్రకటించారు.
ఇందులో కస్టమ్స్ అధికారిగా ఇమ్రాన్ హష్మీ కనిపించనున్నారు. నెట్‌ఫ్లిక్స్‌లో జనవరి 14 నుంచి స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు. తెలుగులోనూ ఇది అందుబాటులోకి రానుంది. టీజర్ బట్టి చూస్తుంటే ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ఎలా స్మగ్లింగ్ చేస్తుంటారు. దీన్ని కస్టమ్స్ అధికారులు ఎలా చేధిస్తారు అనే అంశాలతో దీన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)
దర్శకుడు నీరజ్ పాండే.. గతంలో 'స్పెషల్ చబ్బీస్', 'బేబీ' సినిమాలతో పాటు 'ఖాకీ: ద బిహార్ ఛాప్టర్', 'ఖాకీ: ద బెంగాల్ ఛాప్టర్' సిరీస్‌లు తీశాడు. మంచి గుర్తింపు సంపాదించాడు. ఇప్పుడు కూడా 'టస్కరీ'తో మరో సక్సెస్ అందుకోవడం గ్యారంటీ అనిపిస్తుంది. ఎందుకంటే టీజర్ అయితే ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి ఐశ్వర్య రాజేశ్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా)


