ఓటీటీలోకి ఐశ్వర్య రాజేశ్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా | Mufti Police Movie OTT Telugu Streaming Details | Sakshi
Sakshi News home page

OTT: గత నెలలో థియేటర్లలో రిలీజ్.. ఇప్పుడు ఓటీటీలోకి

Dec 16 2025 5:22 PM | Updated on Dec 16 2025 5:59 PM

Mufti Police Movie OTT Telugu Streaming Details

గతంలో పలు తెలుగు సినిమాల్లో హీరోయిన్‌గా చేసినప్పటికీ ఈ ఏడాది రిలీజైన 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీతో ఐశ్వర్యా రాజేశ్ మంచి గుర్తింపు సంపాదించింది. ప్రస్తుతం పలు భాషల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఈమె లీడ్ రోల్ చేసిన ఓ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ చిత్రం గత నెలలో తెలుగులోనూ రిలీజైంది. ఇప్పుడది ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఇంతకీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)

అర్జున్ సర్జా, ఐశ్వర్యా రాజేశ్ ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ మూవీ 'తీయవర్ కులై నడుంగ'. గత నెల 21న థియేటర్లలో రిలీజైంది. తెలుగులో 'మఫ్టీ పోలీస్' పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. సరైన ప్రమోషన్స్ చేయకుండా విడుదల చేయకపోయేసరికి ఎప్పుడొచ్చి వెళ్లిందో కూడా జనాలకు తెలియలేదు. గతవారం తమిళ వెర్షన్, సన్ నెక్స్ట్ ఓటీటీలో రిలీజైంది. తెలుగు వెర్షన్‌ ఈ శుక్రవారం(డిసెంబరు 19) నుంచి ఆహా ఓటీటీలో అందుబాటులోకి రానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చింది.

'మఫ్టీ పోలీస్' విషయానికొస్తే.. ఓ అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో అర్థరాత్రి రచయిత జెబా దారుణంగా హత్యకు గురవుతారు. ఈ కేసు విచారణని ఇన్‌స్పెక్టర్ మాగుడపాటి (అర్జున్ సర్జా) తీసుకుంటాడు. అయితే అపార్ట్‌మెంట్‌లోని ప్రతి ఒక్కరు అనుమానితులుగా కనిపిస్తారు. మరి ఎస్సై వారిలో అసలైన నిందితుడుని పట్టుకున్నాడా లేదా? ఎవరు హత్య చేశారు? అనుమానితుల నుంచి బయటపడిన రహస్యాలు ఏంటి? ఇందులో ఐశ్వర్యా రాజేశ్ పాత్రేంటి అనేది మిగతా స్టోరీ.

(ఇదీ చదవండి: 'ధురంధర్' సినిమా రివ్యూ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement