breaking news
Mufti Police Movie
-
ఓటీటీలోకి ఐశ్వర్య రాజేశ్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా
గతంలో పలు తెలుగు సినిమాల్లో హీరోయిన్గా చేసినప్పటికీ ఈ ఏడాది రిలీజైన 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీతో ఐశ్వర్యా రాజేశ్ మంచి గుర్తింపు సంపాదించింది. ప్రస్తుతం పలు భాషల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఈమె లీడ్ రోల్ చేసిన ఓ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ చిత్రం గత నెలలో తెలుగులోనూ రిలీజైంది. ఇప్పుడది ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఇంతకీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)అర్జున్ సర్జా, ఐశ్వర్యా రాజేశ్ ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ మూవీ 'తీయవర్ కులై నడుంగ'. గత నెల 21న థియేటర్లలో రిలీజైంది. తెలుగులో 'మఫ్టీ పోలీస్' పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. సరైన ప్రమోషన్స్ చేయకుండా విడుదల చేయకపోయేసరికి ఎప్పుడొచ్చి వెళ్లిందో కూడా జనాలకు తెలియలేదు. గతవారం తమిళ వెర్షన్, సన్ నెక్స్ట్ ఓటీటీలో రిలీజైంది. తెలుగు వెర్షన్ ఈ శుక్రవారం(డిసెంబరు 19) నుంచి ఆహా ఓటీటీలో అందుబాటులోకి రానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చింది.'మఫ్టీ పోలీస్' విషయానికొస్తే.. ఓ అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లో అర్థరాత్రి రచయిత జెబా దారుణంగా హత్యకు గురవుతారు. ఈ కేసు విచారణని ఇన్స్పెక్టర్ మాగుడపాటి (అర్జున్ సర్జా) తీసుకుంటాడు. అయితే అపార్ట్మెంట్లోని ప్రతి ఒక్కరు అనుమానితులుగా కనిపిస్తారు. మరి ఎస్సై వారిలో అసలైన నిందితుడుని పట్టుకున్నాడా లేదా? ఎవరు హత్య చేశారు? అనుమానితుల నుంచి బయటపడిన రహస్యాలు ఏంటి? ఇందులో ఐశ్వర్యా రాజేశ్ పాత్రేంటి అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: 'ధురంధర్' సినిమా రివ్యూ) -
రచయిత హత్య నేపథ్యంలో అర్జున్ సర్జా కొత్త సినిమా
ఐశ్వర్యా రాజేశ్ లీడ్ రోల్స్‌లో నటించిన తమిళ చిత్రం ‘తీయవర్ కులై నడుంగ’. ఈ పోలీస్ ఇన్వెస్టిగేషన్ మూవీ తెలుగులో ‘మఫ్టీ ΄ోలీస్’ టైటిల్‌తో రేపు రిలీజ్ కానుంది. దినేష్ లక్ష్మణన్ దర్శకత్వంలో రూ΄÷ందిన ఈ చిత్రాన్ని తెలుగులో శ్రీలక్ష్మిజ్యోతి క్రియేషన్స్ ద్వారా ఏఎన్ బాలాజీ విడుదల చేస్తున్నారు. ‘‘ఒక రచయిత హత్య నేపథ్యంలో పోలీస్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం రూపొందింది. ఇటీవలి కాలంలో కొందరు పిల్లలకు ఇబ్బందిగా మారిన ఆటిజం వ్యాధి గురించి కూడా ఈ సినిమాలో చర్చించడం జరిగింది. తమిళంతోపాటు తెలుగులోనూ ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అని చెప్పారు ఏఎన్ బాలాజీ. -
సంక్రాంతికి వస్తున్నాం బ్యూటీ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్.. ట్రైలర్ చూశారా?
సంక్రాంతికి వస్తున్నాం బ్యూటీ ఐశ్వర్య రాజేశ్(Aishwarya Rajesh) కీలక పాత్రలో వస్తోన్న చిత్రం మఫ్టీ పోలీస్(Mufti Police Telugu Official Trailer). ఈ మూవీలో అర్జున్ సర్జా కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ పోలీస్ ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ థ్రిల్లర్‌కు దినేశ్ లక్ష్మణన్ దర్శకత్వం వహించారు. మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.తాజాగా విడుదలైన ట్రైలర్ చూస్తే కథ మొత్తం ఓ కేసు చుట్టే తిరగనున్నట్లు తెలుస్తోంది. యాక్షన్ కింగ్ అర్జున్ మరోసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో అలరించనున్నారు. ట్రైలర్లో సన్నివేశాలు చూస్తే ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. కాగా.. ఈ మిస్టరీ థ్రిల్లర్ మూవీ ఈ నెల 21న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో అభిరామి వెంకటాచలం, ప్రవీణ్ రాజా, రామ్ కుమార్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా జీఎస్ ఆర్ట్స్ బ్యానర్లో అరుల్ కుమార్ నిర్మించగా.. భరత్ ఆసీవగన్ సంగీతమందించారు. ఇంకెందుకు ఆలస్యం ట్రైలర్ మీరు కూడా చూసేయండి.


