'బోర్డర్‌ 2' సినిమా టీజర్‌ రిలీజ్ | Border 2 Movie Teaser | Sakshi
Sakshi News home page

Border 2 Teaser: 28 ఏళ్ల తర్వాత సీక్వెల్.. టీజర్ రిలీజ్

Dec 16 2025 2:46 PM | Updated on Dec 16 2025 2:58 PM

Border 2 Movie Teaser

భారత్‌- పాకిస్థాన్‌ యుద్ధం నేపథ్యం కథతో తీసిన సినిమా 'బోర్డర్'. 1997లో రిలీజైన ఈ చిత్రం అప్పట్లో సంచనలమైంది. ప్రేక్షక్షుల నుంచి విశేషాదరణ దక్కించుకుంది. ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్ తీశారు. 'బోర్డర్ 2' పేరుతో తెరకెక్కించారు. సన్నీ డియోల్, వరుణ్‌ ధావన్‌, దిల్జీత్‌ దొసాంజ్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. తాజాగా విజయ్ దివస్ సందర్భంగా టీజర్ రిలీజ్ చేశారు. ఇది ఆకట్టుకునేలా ఉంది.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన హాలీవుడ్ యాక్షన్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్)

వచ్చే ఏడాది రిపబ్లిక్ డే కానుకగా జనవరి 23న ఈ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. తొలి పార్ట్‌కి జెపి దత్తా దర్శకత్వం వహించగా.. రెండో భాగాన్ని అనురాగ్‌ సింగ్‌ తీశారు. 1971లో జరిగిన ఇండో-పాక్ యుద్ధం నేపథ్య కథతోనే ఈ సినిమాని కూడా తెరకెక్కించారు. ఇందులో వరుణ్ ఆర్మీ, దిల్జీత్ ఎయిర్‌ఫోర్స్, అహన్ శెట్టి నేవీ సైనికులుగా కనిపించనున్నారు.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement