ప్రపంచంలో అందమైన టాప్‌ టెన్ హీరోయిన్స్ వీళ్లే.. ఇండియా నుంచి ఆమె ఒక్కరే..! | Top 10 Most Beautiful Actresses in the World 2025 | Sakshi
Sakshi News home page

Most Beautiful Actresses: ప్రపంచంలో అత్యంత అందమైన టాప్‌ టెన్ హీరోయిన్స్..!

Dec 16 2025 4:01 PM | Updated on Dec 16 2025 4:40 PM

Top 10 Most Beautiful Actresses in the World 2025

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్‌ పాత్రలకు గ్లామరస్ చాలా ముఖ్యం. టాలెంట్‌తో పాటు గ్లామర్‌ కూడా కలిసొస్తే ఇక వారికి సినీ ఇండస్ట్రీలో అవకాశాలు నల్లేరు మీద నడకే. కానీ అందంగా ఉన్నప్పటికీ సరైన హిట్ పడకపోయినా ఛాన్స్ రావడం కష్టమే. సినిమా అనే రంగుల ప్రపంచంలో అందానికి ఉన్న ప్రముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

అలా ఈ ఏడాది అత్యంత అందమైన తారల గురించి చర్చించుకుందాం. ప్రపంచవ్యాప్తంగా పరిశీలిస్తే టాప్‌ టెన్‌ అందమైన హీరోయిన్ల లిస్ట్‌లో ఇండియా నుంచి కేవలం ఒక్కరే స్థానం దక్కించుకున్నారు. ఆమె మరెవరో కాదు.. ఆదిపురుష్ భామ కృతి సనన్ మాత్రమే టాప్-5లో నిలిచింది. ఈ ఏడాదితో గానూ ఐఎండీబీ ప్రకటించిన అందాల తారల లిస్ట్‌లో కృతి సనన్ ఐదో స్థానం దక్కించుకుంది.

మొదటి స్థానంలో ఆస్ట్రేలియాకు చెందిన మార్గోట్ రాబీ నిలిచింది. ఆ తర్వాత స్థానాల్లో వరుసగా అమెరికా బ్యూటీ  షైలీన్ వుడ్లీ, చైనాకు చెందిన దిల్‌రుబా దిల్మురాత్, సౌత్ కొరియా బ్యూటీ నాన్నీ మెక్‌డోనీ నిలిచారు. టాప్‌-5 లో బాలీవుడ్ భామ కృతి సనన్‌ స్థానం దక్కించుకుంది. ఆ తర్వాత పాకిస్తాన్‌కు చెందిన హానియా అమీర్ ఆరోస్థానంలో నిలిచింది. ఆ తర్వాత వరుసగా స్పెయిన్‌కు చెందిన అనా డి అర్మాస్, పారిస్‌కు చెందిన ఎమ్మా వాట్సన్, అమెరికాకు చెందిన అంబర్ హెర్డ్, టర్కీ బ్యూటీ హ్యాండే ఎర్సెల్‌ నిలిచారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement