
టీమిండియా క్రికెటర్, ప్రస్తుతం ఐపీఎల్ లో పంజాబ్ జట్టుకు ఆడుతున్న యజువేంద్ర చాహల్.. కొన్నాళ్ల క్రితం విడాకులు తీసుకున్నాడు. 2020లో యూట్యూబర్, డ్యాన్సర్ ధనశ్రీ వర్మతో చాహల్ పెళ్లి జరిగింది. అయితే వీళ్ల బంధం చాలావరకు బాగానే ఉండేది. మరి ఏమైందో ఏమో గానీ గత కొన్నాళ్లుగా వేర్వేరుగా ఉన్నారు. ఈ ఏడాది అధికారికంగా విడాకులు తీసేసుకున్నారు.
అయితే భర్త నుంచి విడిపోయిన తర్వాత ధనశ్రీ.. సినిమాల్లో బిజీ అయిపోతోంది. మొన్నీమధ్యే తెలుగులో 'ఆకాశం దాటివస్తావా' మూవీలో హీరోయిన్ గా చేసింది. ఇప్పుడు ఓ హిందీ చిత్రంలో ఐటమ్ సాంగ్ చేసింది. ఇప్పుడీ ఈ విషయాన్ని ఈమెనే స్వయంగా వెల్లడించింది.
(ఇదీ చదవండి: మహేశ్ ఇంట్లో మరో హీరో రెడీ.. అన్నీ ఫిక్స్!)
రాజ్ కుమార్ రావ్, వామికా గబ్బీ హీరోహీరోయిన్లుగా నటించిన 'భూల్ చుక్ మాఫ్' చిత్రం మే 09న థియేటర్లలోకి రానుంది. ఇందులోని ప్రత్యేక గీతంలో ధనశ్రీ నర్తించింది. ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే సినిమాల్లో నటించే విషయమై చాహల్-ధనశ్రీ మధ్య విభేదాలు వచ్చి విడాకులు తీసుకున్నారా అనే సందేహం వస్తోంది.
ఎందుకంటే విడాకులు తీసుకున్న కొన్నిరోజుల తర్వాత తెలుగు, హిందీలో తాను చేస్తున్న సినిమాల గురించి ధనశ్రీ పోస్ట్ పెట్టింది. ఈ సినిమాలు సక్సెస్ అయితే గనక ఈమె పూర్తిస్థాయిలో హీరోయిన్ గా మారిపోతుందేమో చూడాలి?
(ఇదీ చదవండి: హీరో కిరణ్ అబ్బవరం ఇంట్లో సీమంతం వేడుక)