
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం త్వరలో తండ్రి కాబోతున్నాడు. ఈ విషయాన్ని ఈ ఏడాది జనవరిలోనే ప్రకటించారు. తన భార్య గర్భంతో ఉందని చెప్పాడు. ఇప్పుడు ఈమెకు గ్రాండ్ గా సీమంతం జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలని కిరణ్ భార్య రహస్య తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.
(ఇదీ చదవండి: పవన్ 'హరిహర వీరమల్లు'.. అంతా ఓటీటీ దయ!)
కడపకు చెందిన కిరణ్ అబ్బవరం.. షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ నటుడిగా కెరీర్ ప్రారంభించాడు. 'రాజావారు రాణిగారు' సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. ప్రేక్షకుల్ని అలరించాడు. తర్వాత చాలా సినిమాలు చేశాడు గానీ అవన్నీ ఫ్లాప్స్ అయ్యాయి. కానీ గతేడాది 'క' మూవీ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాడు.
్యక్తిగత జీవితానికొస్తే.. తన తొలి సినిమాలో హీరోయిన్ గా నటించిన రహస్య గోరఖ్ నే కిరణ్ అబ్బవరం ప్రేమించాడు. కొన్నేళ్ల పాటు రిలేషన్ లో ఉన్న వీళ్లిద్దరూ గతేడాది పెళ్లి చేసుకున్నారు. ఈ జనవరిలో ప్రెగ్నెన్సీ ప్రకటించారు. ఇప్పుడు సీమంతం జరిగింది. మరో ఒకటి రెండు నెలల్లో కిరణ్-రహస్యకు బేబీ పుట్టబోతున్నాడు. ఈ క్రమంలోనే పలువురు నెటిజన్స్ శుభాకాంక్షలు చెబుతున్నారు.
(ఇదీ చదవండి: మహేశ్ ఇంట్లో మరో హీరో రెడీ.. అన్నీ ఫిక్స్!)