యజ్వేంద్ర చాహల్ ప్రస్తుతానికి టీమిండియా తరఫున పెద్దగా మ్యాచులేం ఆడట్లేదు. కానీ ఎప్పటికప్పుడు ఏదోలా వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు. ఐపీఎల్‌లో పంజాజ్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇతడు.. వ్యక్తిగత మాత్రం ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ అయిపోతూనే ఉన్నాడు. తాజాగా మూడోసారి ప్రేమలో పడినట్లు కనిపిస్తున్నాడు. బిగ్‌బాస్ బ్యూటీతో డిన్నర్ డేట్‌కి వెళ్లిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది.
(ఇదీ చదవండి: సిరై రివ్యూ: కంటతడి పెట్టించే సినిమా.. పోలీస్ ఇలానే ఉంటాడు)
టీమిండియాకు ఆడుతున్న టైంలోనే చాహల్.. కొరియోగ్రాఫర్, డ్యాన్సర్ ధనశ్రీ వర్మని పెళ్లి చేసుకున్నాడు. 2020-25 వరకు దాదాపు ఐదేళ్ల పాటు కలిసున్న వీళ్లిద్దరూ గతేడాది మార్చిలో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఆర్జే మహావశ్ అనే అమ్మాయితో చాహల్ కొన్నాళ్ల పాటు సన్నిహితంగా ఉన్నట్లు వార్తలొచ్చాయి. అందుకు తగ్గట్లే పలుమార్లు వీళ్లిద్దరూ కలిసి కనిపించారు. మరి కారణాలేంటో తెలీదు గానీ రెండు మూడు రోజుల క్రితం ఆర్జే మహ్‌వశ్, చాహల్.. ఇన్ స్టాలో ఒకరిని ఒకరు అన్‌ఫాలో చేసుకున్నారు. అంటే బ్రేకప్ చెప్పేసుకున్నట్లే!
ఇప్పుడు చాహల్.. బిగ్‌బాస్ 13 హిందీ ఫేమ్, యాంకర్ సెఫాలీ బగ్గాతో జంటగా కనిపించాడు. దీంతో వీళ్లిద్దరూ డేటింగ్ చేస్తున్నారా అని బాలీవుడ్ మీడియా గుసగుసలాడుకుంటోంది. ఏదేమైనా ఇలా పలువురు అమ్మాయిలతో చాహల్ కనిపిస్తుండటం సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంది.
(ఇదీ చదవండి: పరోటా మాస్టర్‌కి గోల్డ్ చెయిన్ గిఫ్ట్ ఇచ్చిన రజనీకాంత్)
Yuzi Chahal 𝗱𝗮𝘁𝗶𝗻𝗴 a new girl - He moves on faster than the speed of light. 😅
- 𝟮𝟭 𝗝𝗮𝗻: Chahal and RJ Mahvash unfollow each other.
- 𝟮𝟰 𝗝𝗮𝗻: Chahal spotted at dinner with a new girl, Shefali Bagga.
ONE YEAR BACK :-
- 𝟰 𝗝𝗮𝗻 𝟮𝟬𝟮𝟱: Chahal and Dhanashree… pic.twitter.com/L4FxUbNn8m— Jara (@JARA_Memer) January 25, 2026


