సూపర్‌స్టార్ రజనీకాంత్.. ఎప్పటికప్పుడు గోల్డ్ చెయిన్స్ గిఫ్ట్ ఇస్తుంటారు. వీటిని అందుకున్న వాళ్లలో సెలబ్రిటీలే ఎక్కువగా ఉంటుంటారు. ఏదైనా సినిమా నచ్చితే.. హీరో లేదా దర్శకుడిని పిలిచి రజనీ.. బంగారు చెయిన్స్ ఇస్తుంటారు. ఈసారి మాత్రం పరోటాలు చేసే ఓ వ్యక్తికి ఇచ్చారు. అతడి కుటుంబాన్ని తన ఇంటికి పిలిపించుకుని ఈ బహుమానం అందజేశారు. ఈ ఫొటో ఇప్పుడు వైరల్ అవుతోంది.
(ఇదీ చదవండి: సిరై రివ్యూ: కంటతడి పెట్టించే సినిమా.. పోలీస్ ఇలానే ఉంటాడు)
తమిళనాడులోని మధురైలో శేఖర్ అనే వ్యక్తి.. పరోటా షాప్ నడుపుతున్నాడు. గత 13 ఏళ్ల నుంచి 5 రుపాయలకే పరోటా అమ్ముతున్నాడు. గతంలో ఇతడికి సంబంధించిన పలు వీడియోలు వైరల్ అయ్యాయి కూడా. ఇతడి పేరు శేఖర్ అయినప్పటికీ అందరూ రజనీకాంత్ శేఖర్ అని పిలుస్తుంటారు. ఎందుకంటే తలైవర్‌కి అంత వీరాభిమాని కాబట్టి. ఈ క్రమంలోనే తాజాగా రజనీ నుంచి శేఖర్ కుటుంబానికి పిలుపు వచ్చింది. తాజాగా శేఖర్‌ని ఇంటికి పిలిపించుకున్న రజనీకాంత్.. అతడికి బంగారు చెయిన్ బహుమతిగా ఇచ్చారు.
(ఇదీ చదవండి: 'హుక్ స్టెప్' అలా పుట్టింది: కొరియోగ్రాఫర్ ఆట సందీప్)


