ఈసారి సంక్రాంతి రిలీజైన సినిమాల్లో చిరంజీవి 'మన శంకర వరప్రసాద్' సక్సెస్ అందుకుంది. కంటెంట్ పరంగా కొత్తగా ఏం లేనప్పటికీ.. కుటుంబ ప్రేక్షకులకు దీన్ని చూసేందుకే ఎక్కువ ఆసక్తి చూపించారు. దీంతో రూ.300 కోట్లకు పైగా కలెక్షన్ వచ్చాయని మూవీ టీమ్ ప్రకటించారు. ఇందులో ప్రధానంగా చిరు వేసిన 'హుక్ స్టెప్' సెంటరాఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. అయితే ఆ స్టెప్ ఎలా పుట్టిందో కొరియోగ్రాఫర్ ఆట సందీప్ మాస్టర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
(ఇదీ చదవండి: ఆ రికార్డ్ ఇకపై చిరంజీవి సొంతం!)
'రేపు పాట షూటింగ్. ఇంకా హుక్ స్టెప్ కంపోజ్ చేస్తున్నాను. స్టెప్ రావట్లేదు. ఒకపక్కన ఫోన్ కాల్స్. నిజంగా చెబుతున్న ఆ టైంలో చాలా గందరగోళానికి గురయ్యా. భయం ఏంటంటే చిరంజీవితో సాంగ్ చేస్తున్నా. మరోవైపు వాళ్లు వీళ్లు ఊరికే ఫోన్ చేస్తున్నారు. నా భయం ఏంటంటే చిరంజీవి ఆఫీస్ నుంచి ఫోన్ వస్తుందా? లేదంటే ఓ కాస్ట్యూమర్ చేస్తున్నాడా? డ్యాన్సర్స్ కోసం చేస్తున్నారా? లేదంటే ప్రాపర్టీస్ కోసం చేస్తున్నారా? ఎవరు చేస్తున్నారో తెలియట్లేదు. ఊరికే ఫోన్స్ వస్తున్నాయి. ఇంకా ఆ టైంలో నా ఫోన్‌ని తీసి నేలకేసి కొడదామనుకున్నా. అప్పటిదాకా రాని స్టెప్.. ఫోన్ పట్టుకోగానే వచ్చింది. అప్పుడు వచ్చిన స్టెప్ ఏదైతే ఉందో.. అదే హుక్ స్టెప్. నేను కంపోజ్ చేయడం ఒకత్తెయితే.. కూరకు ఉప్పు, మసాలా, కారం జోడించినట్లు చిరంజీవి గ్రేస్ కలిపారు' అని సందీప్ మాస్టర్ చెప్పాడు.
దాదాపు 15-20 ఏళ్ల క్రితం డ్యాన్స్ షోలతో గుర్తింపు తెచ్చుకున్న సందీప్.. తోటి డ్యాన్సర్ జ్యోతిని పెళ్లి చేసుకున్నాడు. వీళ్లిద్దరూ కలిసి హైదరాబాద్‌లోనే డ్యాన్స్ స్కూల్స్ కూడా రన్ చేస్తున్నారు. దాదాపు 18 ఏళ్ల తర్వాత తనకు చిరంజీవితో పనిచేసే అవకాశమొచ్చిందని ఆట సందీప్ రీసెంట్ టైంలో పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చాడు. చూడటానికి సింపుల్‌గా అనిపించే ఈ స్టెప్.. అటు ఫ్యామిలీ ఆడియెన్స్, ఇటు కుర్రాళ్లకు బాగానే నచ్చేసిందని చెప్పొచ్చు.
(ఇదీ చదవండి: సిరై రివ్యూ: ప్రేక్షకుల్ని కంటతడి పెట్టించే సినిమా.. పోలీస్ ఉండేది ఇలానే)


