ఆ రికార్డ్ ఇకపై చిరంజీవి సొంతం! తొలివారం కలెక్షన్ ఎంతంటే? | Mana Shankara Vara Prasad Garu Collection First Week | Sakshi
Sakshi News home page

Mana Shankara Vara Prasad Garu: ఆల్ టైమ్ రికార్డ్.. చిరు సినిమా వారం వసూళ్లు ఇవే

Jan 19 2026 12:03 PM | Updated on Jan 19 2026 12:07 PM

Mana Shankara Vara Prasad Garu Collection First Week

ప్రభాస్ 'రాజాసాబ్' తప్పితే సంక్రాంతి రిలీజైన మిగతా సినిమాలన్నీ పాజిటివ్ టాక్ అందుకున్నాయి. కానీ చిరంజీవి చిత్రానికి ఊహించని రెస్పాన్స్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు ప్రతి థియేటర్లు ఇప్పటికీ హౌస్‌ఫుల్స్ అవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే తొలివారం పూర్తయ్యేసరికి కళ్లు చెదిరే కలెక్షన్స్ వచ్చాయి. ఈ మేరకు నిర్మాతలు అధికారికంగా నంబర్స్ ప్రకటించారు. అలానే ఆల్ టైమ్ రికార్డ్ అన్నట్లు చెప్పుకొచ్చారు.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 28 సినిమాలు)

చిరంజీవి 'మన శంకరవరప్రసాద్ గారు' చిత్రానికి తొలివారం పూర్తయ్యేసరికి రూ.292 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయని పోస్టర్ రిలీజ్ చేశారు. అలానే తెలుగు రాష్ట్రాల్లో ప్రతిచోటా ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అయిపోయినట్లు తెలుస్తోంది. రిలీజైన తర్వాత ఏడురోజు అంటే నిన్న కూడా చాలాచోట్ల హౌస్‌ఫుల్స్ పడ్డాయి. దీంతో ఏడో రోజు వసూళ్లలో 'అల వైకుంఠపురములో'ని చిరు చిత్రం అధిగమించినట్లు సమాచారం.

మరోవైపు తొలివారంలోనే ఈ రేంజు వసూళ్లు అందుకున్న ప్రాంతీయ చిత్రం ఇదేనని నిర్మాతలు ఘనంగా ప్రకటించుకున్నారు. అంటే చిరంజీవి సరసన కొత్త రికార్డ్ చేరినట్లే. ఇకపోతే ఇవాళ్టి నుంచి అందరూ నార్మల్ లైఫ్‌కి వచ్చేస్తారు కాబట్టి వసూళ్లు కాస్త తగ్గొచ్చు. కాకపోతే లాంగ్ రన్‪‌లో ఎంత వసూళ్లు వస్తాయనేది చూడాలి? ఫిబ్రవరి తొలివారం వరకు పెద్దగా చెప్పుకోదగ్గ మూవీస్ లేకపోవడం 'మన శంకరవరప్రసాద్'కి కలిసొచ్చేలా కనిపిస్తోంది.

(ఇదీ చదవండి: హ్యాట్రిక్ ఫ్లాప్స్ తర్వాత మెగా హీరో హారర్ మూవీ.. గ్లింప్స్ రిలీజ్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement