ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 28 సినిమాలు | Upcoming OTT Movies Telugu January Third Week 2026 | Sakshi
Sakshi News home page

OTT Movies This Week: ఓటీటీల్లో ఈ వారం 28 మూవీస్ రిలీజ్.. మరి థియేటర్లలో?

Jan 19 2026 11:37 AM | Updated on Jan 19 2026 11:46 AM

Upcoming OTT Movies Telugu January Third Week 2026

మరోవారం వచ్చేసింది. సంక్రాంతి రిలీజైన తెలుగు సినిమాల్లో చిరంజీవి, నవీన్ పొలిశెట్టి, శర్వానంద్ చిత్రాలు.. ప్రేక్షకుల్ని అలరిస్తున్నాయి. దీంతో ఎప్పటిలానే ఈ వారం కొత్త రిలీజులు ఏం లేవు. 'ఓం శాంతి శాంతి శాంతిః' అనే తెలుగు మూవీని 23వ తేదీన రిలీజ్ చేస్తామని చాన్నాళ్ల క్రితం ప్రకటించారు గానీ ప్రమోషన్స్ చేయట్లేదు. దీంతో వాయిదా కన్ఫర్మ్ అనిపిస్తుంది. మరోవైపు 'బోర్డర్ 2' అనే హిందీ చిత్రం ఇదే వీకెండ్ థియేటర్లలోకి రానుంది.

(ఇదీ చదవండి: హ్యాట్రిక్ ఫ్లాప్స్ తర్వాత మెగా హీరో హారర్ మూవీ.. గ్లింప్స్ రిలీజ్)

ఓటీటీల్లో అయితే 28 వరకు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఈ వారం స్ట్రీమింగ్ కానున్నాయి. శోభిత ధూళిపాళ్ల 'చీకటిలో' మూవీ ఆసక్తికరంగా అనిపిస్తోంది. దీంతో పాటు తేరే ఇష్క్ మైన్, మార్క్ అనే డబ్బింగ్ చిత్రాలు.. 45, సిరాయ్ అనే పరభాష సినిమాలు ఉన్నంతలో ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. ఇంతకీ ఏ మూవీ ఏ ఓటీటీలోకి రానుందంటే?

ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (జనవరి 19 నుంచి 25 వరకు)

అమెజాన్ ప్రైమ్

  • ప్రిపరేషన్ ఫర్ ద నెక్స్ట్ లైఫ్ (ఇంగ్లీష్ మూవీ) - జనవరి 19

  • స్టీల్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 21

  • చీకటిలో (తెలుగు సినిమా) - జనవరి 23

  • ఇట్స్ నాట్ లైక్ దట్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 25

నెట్‌ఫ్లిక్స్

  • సండోకన్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 19

  • జస్ట్ ఏ డ్యాష్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 20

  • రిజోలి & ఐల్స్ సీజన్ 1-7 (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 20

  • సింగిల్స్ ఇన్‌ఫెర్నో సీజన్ 5 (కొరియన్ సిరీస్) - జనవరి 20

  • స్టార్ సెర్చ్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 20

  • కిడ్నాపెడ్: ఎలిజిబెత్ స్మార్ట్ (ఇంగ్లీష్ సినిమా) - జనవరి 21

  • క్వీర్ ఐ సీజన్ 10 (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 21

  • కాస్మిక్ ప్రిన్సెస్ కగుయా (జపనీస్ సినిమా) - జనవరి 22

  • ఫైండింగ్ హెర్ ఎడ్జ్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 22

  • ఫ్రీ బెర్ట్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 22

  • స్కై స్క్రాపర్ లైవ్ (ఇంగ్లీష్ సినిమా) - జనవరి 23

  • తేరే ఇష్క్ మైన్ (తెలుగు డబ్బింగ్ చిత్రం) - జనవరి 23

  • ద బిగ్ ఫేక్ (ఇటాలియన్ సినిమా) - జనవరి 23

హాట్‌స్టార్

  • ఏ నైట్ ఆఫ్ ద సెవెన్ కింగ్‌డమ్స్ సీజన్ 1 ఎపిసోడ్ 1 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జనవరి 19

  • హిమ్ (ఇంగ్లీష్ సినిమా) - జనవరి 19

  • మార్క్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - జనవరి 23

  • స్పేస్ జెన్: చంద్రయాన్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 23

ఆహా

  • సల్లియర్గళ్ (తమిళ మూవీ) - జనవరి 20

జీ5

  • 45 (కన్నడ సినిమా) - జనవరి 23

  • మస్తీ 4 (హిందీ మూవీ) - జనవరి 23

  • సిరాయ్ (తమిళ సినిమా) - జనవరి 23

  • కాళీపోట్కా (బెంగాలీ సిరీస్) - జనవరి 23

ఆపిల్ టీవీ ప్లస్

  • డ్రాప్ ఆఫ్ గాడ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 21

ముబీ

  • లా గ్రేజియా (ఇటాలియన్ మూవీ) - జనవరి 23

(ఇదీ చదవండి: నా మాటల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు: ఏఆర్‌ రెహమాన్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement