నా మాటల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు: ఏఆర్‌ రెహమాన్‌ | Music Director AR Rahman Apologises for his Remarks | Sakshi
Sakshi News home page

AR Rahman: ఎవర్నీ బాధపెట్టాలనుకోలేదు, రామాయణ సినిమాకు..

Jan 19 2026 8:16 AM | Updated on Jan 19 2026 8:44 AM

Music Director AR Rahman Apologises for his Remarks

కొన్నిసార్లు మన అభిప్రాయాలు ఇతరులకు తప్పుగా అర్థమయ్యే అవకాశం ఉందనే విషయాన్ని అర్థం చేసుకున్నాను అంటున్నారు ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌. ఇండస్ట్రీలో ఎనిమిదేళ్లుగా పవర్‌ షిఫ్ట్‌ నెలకొందని, సృజనాత్మక లేనివారే క్రియాశీలంగా వ్యవహరిస్తున్నారని, ఇందుకు మతపరమైన అంశం కూడా కారణం కావొచ్చని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు రెహమాన్‌. 

అర్థం చేసుకున్నారు
అంతేకాకుండా ఆ ప్రభావం తనపై పడినట్లు తనకు అనిపించలేదు కానీ, పడిందన్నట్లుగా కొందరు గుసగుసలాడుకున్నట్లు తెలిసిందని కూడా పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలను పలువురు నటీనటులు, రాజకీయ నాయకులు తప్పుపట్టారు. తాజాగా ఈ వివాదంపై ఏఆర్‌ రెహమాన్‌ స్పందిస్తూ ఓ వీడియో రిలీజ్‌ చేశారు. భారతదేశం నా ఇల్లు.. నా గురువు.. నాకు స్ఫూర్తి. కొన్నిసార్లు మన అభిప్రాయాలను ఇతరులు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉందని తెలుసుకున్నాను. 

బాధ పెట్టాలనుకోలేదు
కానీ, నా ఆలోచన మాత్రం ఎప్పుడూ సంగీతం గౌరవించబడటమే.. సంగీతానికి సేవ చేయడమే.. అలాగే నేను ఎవర్నీ బాధపెట్టాలనుకోవడం లేదు. నా నిజాయితీని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇక భావవ్యక్తీకరణ స్వేచ్ఛ కలిగిన భారతదేశంలో నేను భారతీయుడిగా ఉండటాన్ని అదృష్టంగా భావిస్తున్నాను. 

కృతజ్ఞతతో ఉంటా..
అలాగే గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో వేవ్స్‌ సమ్మిట్‌ -2025లో ఝాలా ప్రదర్శన, రూహ్‌- ఎ-నూర్‌, సన్‌ షైన్‌ ఆర్కెస్ట్రాకు మార్గదర్వకత్వం వహించడం, ఇండియాస్‌ ఫస్ట్‌ మల్టీకల్చరల్‌ వర్చ్యువల్‌ బ్యాండ్‌ 'సీక్రెట్‌ మౌంటైన్‌'ను బిల్డ్‌ చేయడం, హన్స్‌ జిమ్మర్‌తో కలిసి రామాయణ సినిమాకు సంగీతం అందిస్తుండటం.. ఇలా ప్రతీది నా జర్నీని బలోపేతం చేస్తుందనుకుంటున్నాను. ఈ దేశానికి కృతజ్ఞతతో ఉంటాను. జై హింద్‌, జయహో.. అంటూ వీడియోలో మాట్లాడారు రెహమాన్‌. మా తుఝే సలామ్‌, వందేమాతరం అంటూ ఓ స్టేడియంలో ఆడియన్స్‌ పాడుతున్న విజువల్స్‌ కూడా ఈ వీడియోలో ఉన్నాయి.

 చదవండి: 20 ఏళ్ల వయసులో తమన్నాకు చేదు అనుభవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement