పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రిలీజ్ డేట్‌లో మార్పు | Ustaad Bhagat Singh Release Date Changed | Sakshi
Sakshi News home page

పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రిలీజ్ డేట్‌లో మార్పు

Mar 5 2026 12:28 PM | Updated on Mar 5 2026 12:39 PM

Ustaad Bhagat Singh Release Date Changed

హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవన్‌ కల్యాణ్‌ హీరోగా నటించిన తాజా చిత్రం  ‘ఉస్తాద్ భగత్ సింగ్’. మార్చి 26న ఈ చిత్రం విడుదల కావాల్సింది. కానీ యశ్‌ ‘టాక్సిక్‌’ వాయిదా పడడంతో కాస్త ముందుగానే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ చిత్రాన్ని మార్చి 19వ తేదీన విడుదల చేయనున్నట్లు తాజాగా చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. వరుసగా వచ్చే లాంగ్ వీకెండ్లు, దాదాపు రెండు వారాల పాటు ఉండే సెలవుల ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్న ఈ చిత్రానికి మొదట దేవిశ్రీ సంగీత దర్శకుడు.  అయితే ఇప్పటికీ బ్యాగ్‌గ్రౌండ్‌ స్కోర్‌ పూర్తి కాకపోవడంతో..బీజీఎం కోసం తమన్‌ని రంగంలోకి దించారు. పాటలు దేవిశ్రీ.. బీజీఎం తమన్‌ అందించబోతున్నట్లు మేకర్స్‌ అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేశారు. అయితే డీఎస్పీ ఫ్యాన్స్‌ మాత్రం నిర్మాణ సంస్థ తీసుకున్న నిర్ణయంపై ఫైర్‌ అవుతున్నారు. దేవిశ్రీ కంటే గొప్ప సంగీతం ఇంకెవరు అందించలేరని.. నిర్మాణ సంస్థ తప్పుడు నిర్ణయం తీసుకుందంటూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement