
పవన్ కల్యాణ్ హీరోగా రూపొందుతోన్న తాజా చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. నేడు (సెప్టెంబర్ 2) పవన్ కల్యాణ్ పుట్టినరోజు.
ఈ సందర్భంగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి పవన్ కల్యాణ్ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. ‘‘ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఈ నెల 6న ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్‌తో టాకీ భాగం దాదాపు పూర్తవుతుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: అయనంక బోస్, సీఈఓ: చెర్రీ, ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్స్: దినేష్ నరసింహన్, హరీష్.