నాలుగు పదులు దాటినా ఇంకా పెళ్లి ఊసెత్తని హీరోల్లో శింబు ఒకరు. ఈ తమిళ హీరో గతంలో నయనతార, హన్సిక వంటి హీరోయిన్లతో ప్రేమలో పడ్డాడు కానీ ఆ ప్రేమ పెళ్లి పట్టాలెక్కకముందే బ్రేకప్ అయింది. ప్రస్తుతం సినిమాలపైనే ఫోకస్ పెట్టిన ఈ హీరో ప్రేమ, పెళ్లిని కాస్త సైడ్‌కు నెట్టేశాడు. ఇదే విషయాన్ని తాజాగా ఓ ఈవెంట్‌లోనూ కాస్త ఫన్నీగా చెప్పాడు.
అందరి నోటా ఒకటే ప్రశ్న
మలేషియాలో ఓ కార్యక్రమానికి హాజరైన శింబుకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. భారీ పూలమాలతో సాదరంగా ఆహ్వానించారు. తర్వాత అక్కడే ఉన్న ఓ యాంకర్.. సర్, అందరూ ఒకటే అడుగుతున్నారు.. అదే మీ పెళ్లెప్పుడు? అని మెల్లిగా కూపీ లాగింది.
ఆల్‌రెడీ అయిపోయిందిగా!
అందుకు శింబు నవ్వుతూ.. అదేంటి, నాకు ఆల్‌రెడీ 120 సార్లు పెళ్లయిపోయిందిగా! అని జోక్ చేస్తూనే జీవితంలో ఎప్పుడు ఏది జరగాలనుంటే అది జరుగుతుంది అని బదులిచ్చాడు. లైఫ్‌లో ఒంటరిగా ఉన్నామా? ఒకరితో బంధాన్ని కలుపుకున్నామా? అన్నది ముఖ్యం కాదు. మనం మంచిగా ఉంటే అంతే చాలు అన్నాడు.
అరసన్ మూవీ
తర్వాత అభిమానుల కోరిక మేరకు ఓ తమిళ పాటను ఆలపించాడు. ఇకపోతే ప్రస్తుతం శింబు 'అరసన్' (తెలుగులో సామ్రాజ్యం) సినిమా చేస్తున్నాడు. వేట్రిమారన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ షూటింగ్ రేపోమాపో ప్రారంభం కానుంది. ఇందులో విజయ్ సేతుపతి, సముద్రఖని, కిషోర్, ఆండ్రియా జెర్మియా తదితరులు కీలక పాత్రలు పోషించనున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నాడు.
చదవండి: రీతూ ఎలిమినేషన్‌కు కారణాలివే!


