మెగాస్టార్ చిరంజీవి, నయనతార కలిసి నటిస్తున్న సినిమా ‘మన శంకర వరప్రసాద్ గారు’.. సంక్రాంతికి కానుకగా ఈ చిత్రం విడుదల కానుంది. దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో వెంకటేశ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. భీమ్స్ సిసిరోలియో అందించిన సంగీతానికి ఫ్యాన్స్ ఫీదా అవుతున్నారు. ఇప్పటి వరకు విడుదలైన రెండు పాటలు నెట్టింట సందడి చేస్తున్నాయి. ప్రేక్షకుల నుంచి కూడా మంచి ఆదరణ వస్తుంది. అయితే, ఈ మూవీలో వెంకటేశ్‌కు ఎంత సమయం పాటు స్క్రీన్ స్పేష్ ఇచ్చారనేది దర్శకుడు క్లారిటీ ఇచ్చారు.
దర్శకుడు అనిల్ రావిపూడి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వెంకటేష్ క్యామియో రోల్ గురించి ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. 'ఈ మూవీలో ఒక ప్రధాన పాత్ర ఉందని చిరంజీవితో నేను చెప్పాను. దీంతో వెంకటేశ్‌ను ఎంపిక చేయాలని ఆయన పట్టుబట్టారు. ఆయన ఇమేజ్‌కు తగ్గకుండా ఆ పాత్ర కోసం మరింత లోతుగా పనిచేశాను. వెంకీ దాదాపు 20 నిమిషాల పాటు తెరపై కనిపిస్తారు. చిరంజీవి, వెంకటేశ్ కలిసి నటించిన క్లైమాక్స్ సీన్స్ అభిమానులను తప్పకుండా అలరిస్తాయి. వారిద్దరూ కలిసి చేసే డ్యాన్స్, పంచే కామెడీకి ఫిదా అవుతారు' అని పంచుకున్నారు.
చిరంజీవి అంటే తనకు ఎంతో ఇష్టమని వెంకటేశ్ గతంలో పంచుకున్నారు. తన ఫేవరెట్ నటుడితో కలిసి పని చేయడం ఆనందంగా ఉందన్నారు. చిరంజీవి కూడా వెంకీపై ప్రశంసలు కురిపించారు. ఈ సినిమాలో కలిసి నటించినందుకు థాంక్స్ అంటూనే.. వెంకీ రాకతో ఈ చిత్రానికి ప్రత్యేకత తీసుకొచ్చారని చిరు పేర్కొన్నారు. వెంకీతో కలిసి వర్క్ చేసిన పది రోజులు ఎప్పటికీ గుర్తుండిపోతాయన్నారు. డిసెంబర్ 15 నుంచి ‘మన శంకర వరప్రసాద్ గారు’ ప్రమోషన్స్‌లలో దూకుడు పెంచనున్నారని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మించారు.


