'శశిరేఖ' పూర్తి సాంగ్‌.. చిరు, నయన్‌ మ్యాజిక్‌ | Sasirekha Full Lyrical song out from Mana Shankara Varaprasad Garu movie | Sakshi
Sakshi News home page

'శశిరేఖ' పూర్తి సాంగ్‌.. చిరు, నయన్‌ మ్యాజిక్‌

Dec 7 2025 11:28 AM | Updated on Dec 7 2025 12:33 PM

Sasirekha Full Lyrical song out from Mana Shankara Varaprasad Garu movie

మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా నుంచి శశిరేఖ అంటూ సాగే పూర్తి సాంగ్‌ను విడుదల చేశారు.  భీమ్స్ సిసిరోలియో సంగీతానికి చిరు, నయనతార వేసిన క్లాసిక్‌ స్టెప్పులకు ఫిదా కావాల్సిందే.  అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న  ఈ మూవీ 2026 సంక్రాంతికి విడుదల కానుంది. చాలా కలర్‌ఫుల్‌ లోకేషన్స్‌లో ఈ సాంగ్‌ను షూట్‌ చేశారు. ఈ పాటకు  లిరిక్స్‌ అనంత్‌ శ్రీరామ్‌ అందించగా.. భీమ్స్ సిసిరోలియో, మధుప్రియ ఆలపించారు.   సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో గోదావరి గట్టు సాంగ్‌కు ఎంత క్రేజ్‌ వచ్చిందో ఈ పాటకు కూడా అంతే క్రేజ్‌ రావచ్చు. ఈ మూవీలో చిరంజీవి–నయనతార భార్యాభర్తలుగా నటిస్తున్నారు.  ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ‘మీసాల పిల్ల..’పాట ఏ స్థాయిలో శ్రోతలను అలరించిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇందులో వెంకటేశ్‌ కీలకపాత్రలో కనిపించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement