25 ఏళ్ల తరువాత మళ్లీ తెరపైకి పడయప్పా
తమిళసినిమా: గతంలో మంచి విజయాన్ని సాధించిన చిత్రాలు ఇప్పుడు మళ్లీ రీ రిలీజ్ అవుతున్నాయి. అలా తాజాగా నటుడు రజినీకాంత్ నటించిన పడియప్పా చిత్రం ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈనెల 12వ తేదీన రీ రిలీజ్ కానుంది. దివంగత నటుడు శివాజీ గణేషన్ ప్రధాన పాత్రను పోషించిన ఈ చిత్రంలో సౌందర్య, రమ్యకృష్ణ, సెంథిల్ , మణివన్నన్, అబ్బాస్ తదితరులు పోషించారు. కే ఎస్ రవికుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించారు. 1999 ఏప్రిల్ పదవ తేదీన విడుదలైన ఈ చిత్రం రజనీకాంత్ వజ్రోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా ఆయన పుట్టినరోజును పురస్కరించుకుని ఈనెల 12వ తేదీన 4కె సౌండ్ ట్రాక్ లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రీ రిలీజ్ కానుంది. కాగా ఇంతకుముందు సంచలన విజయాలు సాధించిన కమలహాసన్ హీరోగా నటించిన నాయకన్, చేరన్ నటించిన ఆటోగ్రాఫ్, విజయ్ సూర్య కలిసి నటించిన ఫ్రెండ్స్ వంటి కొన్ని చిత్రాలు రీ రిలీజ్ అయ్యి పెద్దగా వసూళ్లను సాధించలేకపోయాయి. కాగా కోలీవుడ్లో ఎంజీఆర్, శివాజీ గణేషన్ నటించిన చిత్రాల రీ రిలీజ్ కే ప్రేక్షకుల నుంచి ఆదరణ లభిస్తోంది. అలాంటిది ఇప్పుడు రజినీకాంత్ నటించిన పడయప్పా చిత్రం రీ రిలీజ్ ఏ మేరకు వసూళ్లను సాధిస్తుందన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.
25 ఏళ్ల తరువాత మళ్లీ తెరపైకి పడయప్పా


