ప్రియురాలు మాట్లాడలేదని ప్రియుడు ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

ప్రియురాలు మాట్లాడలేదని ప్రియుడు ఆత్మహత్య

Feb 1 2026 3:37 AM | Updated on Feb 1 2026 3:37 AM

ప్రియురాలు మాట్లాడలేదని ప్రియుడు ఆత్మహత్య

ప్రియురాలు మాట్లాడలేదని ప్రియుడు ఆత్మహత్య

తిరువళ్లూరు: నేపాల్‌ ఖాట్మండు ప్రాంతానికి చెందిన రంజిత్‌పాశ్వాన్‌ కుమారుడు మనీష్‌(19). పదవ తరగతి చదువుకున్న మనీష్‌ ఇటీవల తిరువళ్లూరుకు వలస వచ్చి ప్రముఖ హోటల్‌లో పనిచేస్తున్నాడు. ఈక్రమంలో శుక్రవారం రాత్రి యథావిధిగా పనులు ముగించుకుని రూమ్‌కు వెళ్లిన మనీష్‌, శనివారం ఉదయం పనులకు రాలేదు. దీంతో సహచర కార్మికులు మధ్యాహ్నం వరకు వేచి చూసి అతనికి కోసం వెతికారు. అయితే రూమ్‌లో లేకపోగా, సమీపంలోని బాత్‌రూమ్‌లో ఉరివేసుకుని కనిపించాడు. ఉరికి వేలాడుతున్న యువకుడిని కిందకు దింపి వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. పోలీసుల ప్రాథమిక విచారణలో ప్రియురాలు రెండు రోజులుగా మాట్లాడకపోవడమే ఆత్మహత్యకు కారణంగా నిర్ధారించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement