త‌మిళ‌నాడు ఎన్నిక‌ల బ‌రిలో తెలంగాణ మాజీ గ‌వ‌ర్న‌ర్‌ | BJP releases list of 27 candidates for Tamil Nadu Assembly polls | Sakshi
Sakshi News home page

త‌మిళ‌నాడులో బీజేపీ అభ్య‌ర్థులు వీరే

Apr 3 2026 5:29 PM | Updated on Apr 3 2026 6:21 PM

BJP releases list of 27 candidates for Tamil Nadu Assembly polls

చెన్నై: త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌బోయే అభ్య‌ర్థుల జాబితాను బీజేపీ శుక్ర‌వారం విడుద‌ల చేసింది. అన్నాడీఎంకేతో జ‌ట్టు క‌ట్టిన బీజేపీ 27 స్థానాల్లో పోటీ చేస్తున్న అభ్య‌ర్థుల పేర్ల‌ను తాజాగా ప్ర‌క‌టించింది. ఈ 27 మందిలో న‌లుగురు మ‌హిళా అభ్య‌ర్థులు ఉన్నారు. ఐదుగురు ఎస్సీల‌కు సీట్లు ద‌క్కాయి. తెలంగాణ గ‌వ‌ర్న‌ర్‌గా ప‌నిచేసిన త‌మిళ‌సై సౌంద‌రాజ‌న్.. మైలాపూర్ నుంచి పోటీ చేస్తున్నారు.

అసెంబ్లీ ఎన్నిక‌ల్లో త‌న‌కు పోటీ చేసే అవ‌కాశం ద‌క్కినందుకు త‌మిళ‌సై సౌంద‌రాజ‌న్ సంతోషం వ్య‌క్తం చేశారు. తాను విజ‌యం సాధిస్తాన‌న్న న‌మ్మ‌కాన్ని వ్య‌క్తం చేశారు. ''నాకు చాలా సంతోషంగా ఉంది. ఎన్డీఏ అభ్యర్థుల మధ్య ఎలాంటి తేడా లేదు. చెన్నై నాకు కొత్త ప్రదేశం కాదు. మేము మైలాపూర్‌లో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాము. ప్రజల మధ్య ఉండాలనే ఉద్దేశంతోనే నేను గవర్నర్ పదవి నుంచి తిరిగి వచ్చాను. ప్రతి నాయకుడి కష్టానికి పార్టీ తగిన గౌరవం ఇస్తుంది. అన్నామలైకి తగిన బాధ్యతలు అప్పగిస్తారన్న న‌మ్మ‌కం నాకుంది. డీఎంకే ప్రజా వ్యతిరేక, మహిళా వ్యతిరేక పార్టీ. డీఎంకే కుటుంబ రాజకీయాలను ప్ర‌జ‌లు తిప్పికొడ‌తార‌''ని ఏఎన్ఐతో త‌మిళ‌సై సౌంద‌రాజ‌న్ చెప్పారు. 

భుజం భుజం కలిపి ప్ర‌చారం చేస్తా: అన్నామ‌లై
అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న‌పై బీజేపీ జాతీయ కార్యవర్గ స‌భ్యుడు కె. అన్నామ‌లై 'ఎక్స్‌'లో స్పందించారు. గెలిచే వారినే అగ్ర‌నాయ‌క‌త్వం ఎంపిక చేసింద‌ని పేర్కొంటూ, అభ్యర్థుల‌కు అభినందనలు తెలిపారు. డీఎంకే వంచ‌న‌తో విసిగిపోయిన త‌మిళ‌నాడు ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు ఎన్డీఏ అభ్య‌ర్థుల‌కు ఉంటుంద‌న్నారు. ప్రధానమంత్రి న‌రేంద్ర మోదీ నాయ‌క‌త్వంలో దేశం ప్ర‌గ‌తి పథంలో ప‌య‌నిస్తోంద‌ని, డీఎంకే ప్ర‌భుత్వం కార‌ణంగా అన్నిరంగాల్లో త‌మిళ‌నాడు వెనుబ‌డిపోయింద‌ని తెలిపారు. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఎన్డీఏ కూటమి 210 సీట్లు గెలవాలనే ల‌క్ష్యంతో ప‌నిచేస్తోంద‌ని, దీనికి కార్య‌క‌ర్త‌గా త‌న‌వంతు ప్ర‌య‌త్నం చేస్తాన‌ని చెప్పారు. ఎన్డీఏ అభ్యర్థులందరితో భుజం భుజం కలిపి నిలబడి ప్రచారం చేస్తానని పేర్కొన్నారు.

ఆ బాధ్యతను నెరవేరుస్తా
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల్లో భాగంగా అగ్ర‌నాయ‌క‌త్వం త‌న‌కు ప్ర‌చార బాధ్య‌తలు అప్ప‌గించింద‌ని అన్నామ‌లై తెలిపారు. కేరళలోని కన్నూర్ శుక్రవారం ఆయ‌న ఏఎన్ఐతో మాట్లాడుతూ.. పార్టీ ఆదేశానుసారం బీజేపీ, ఎన్డీఏ అభ్య‌ర్థుల త‌ర‌పున ప్ర‌చారం సాగిస్తున్న‌ట్టు చెప్పారు. "ఈ ఎన్నికలలో తమిళనాడు వ్యాప్తంగా అభ్యర్థుల కోసం ప్రచారం చేయడమే నా పాత్ర. ఈనెల‌ 7వ తేదీ వరకు పుదుచ్చేరి, కేరళలో ప్రచారం చేసే బాధ్యతను పార్టీ నాకు అప్పగించింది. ప్ర‌స్తుతం అదే ప‌నిమీద ఉన్నాను. 7వ తేదీ నుండి 23వ తేదీ వరకు త‌మిళ‌నాడులో ప్ర‌చారానికి వెళ‌తాను. ఇది పార్టీ నాకు అప్పగించిన బాధ్యత. నేను ఆ బాధ్యతను నిర్విస్తానని చెప్పారు. 
 

చ‌ద‌వండి: 21 స్థానాల్లో కాన‌రాని డీఎంకే, అన్నాడీఎంకే గుర్తులు

Advertisement
 
Advertisement
Advertisement