గత కొన్నాళ్లలో ప్రెస్‌మీట్స్ అంటే తెలుగు సినిమా హీరోహీరోయిన్లు చాలామంది భయపడుతున్నారు. ఎందుకంటే చిత్రవిచిత్రమైన ప్రశ్నలు, కొన్నిసార్లయితే మరీ దారుణమైనవి అడుగుతూ సదరు సెలబ్రిటీలని పలువురు రిపోర్టర్లు ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు తమిళంలోనూ ఒకరిద్దరు రిపోర్టర్లు ఇలానే తయారైనట్లు కనిపిస్తున్నారు. తాజాగా లోకేశ్ కనగరాజ్‌కి ఇలాంటి ఓ ఇబ్బందికర ప్రశ్న ఎదురైంది.
(ఇదీ చదవండి: రవితేజ 'ఇరుముడి'పై రీమేక్ రూమర్స్)
గతేడాది 'కూలీ'తో వచ్చిన లోకేశ్ కనగరాజ్.. ప్రస్తుతం హీరోగా ఓ మూవీ చేస్తున్నాడు. అల్లు అర్జున్ హీరోగా ఓ సినిమాకు దర్శకత్వం చేయనున్నాడు. రెండు వారాల క్రితం దీని ప్రకటన వచ్చింది. వీటి గురించి చెప్పేందుకు చెన్నైలో ఆదివారం ప్రెస్‌మీట్ పెట్టాడు. తన గత, ప్రస్తుత చిత్రాల గురించి వివరాలు వెల్లడించాడు. అలానే 'ఖైదీ 2' ఎప్పుడు ఉండబోతుంది? ఎల్‌సీయూ గురించి కూడా క్లారిటీ ఇచ్చేశాడు.
ఇదే ప్రెస్‌మీట్‍లో ఓ రిపోర్టర్.. దర్శకుడు లోకేశ్‌ని ఇబ్బందికర రీతిలో ప్రశ్నించాడు. మీరు ఓ హీరోయిన్‌తో ప్రేమలో ఉన్నారని సోషల్ మీడియాలో రూమర్స్ వస్తున్నాయి? మీరు పెళ్లి చేసుకోబోతున్నారా? అని సదరు రిపోర్టర్ అడగ్గా.. లేదు సర్ నాకు కుటుంబం ఉంది అని లోకేశ్ సమాధానమిచ్చాడు. అయినా సరే రిపోర్టర్ వదలకుండా.. రెండో ఫ్యామిలీ వద్దా? అన్నట్లు అడిగాడు. దీనికి ఆన్సర్ ఇవ్వని లోకేశ్.. ప్రెస్‌మీట్ అక్కడితో ముగించేశాడు. ఈ వీడియో కాస్త వైరల్ కావడంతో సదరు రిపోర్టర్‌పై నెటిజన్లు రెచ్చిపోతున్నారు. చీప్ బిహేవియర్ అని కామెంట్స్ చేస్తున్నారు. లోకేశ్ కనగరాజ్.. 2012లో ఐశ్వర్య అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఈ జంటకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన లేటెస్ట్ 'అనకొండ'.. తెలుగులోనూ)
Loki-Enaku already family irukanga sir
Reporter-2nd family 🤮
Poi un wife ta kelu da 2nd family venuma nu 😡 pic.twitter.com/uOSKTiMpXp— Shyam (@Shyam_1200) January 26, 2026


