రిచ్‌ కావాలంటే... | Carmeni Selvam Telugu trailer released | Sakshi
Sakshi News home page

రిచ్‌ కావాలంటే...

Mar 14 2026 1:29 AM | Updated on Mar 14 2026 1:30 AM

Carmeni Selvam Telugu trailer released

సముద్ర ఖని ప్రధాన పాత్రలో, గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్, లక్ష్మీ ప్రియా కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘కార్మేని సెల్వం’. రామ్‌ చక్రి దర్శకత్వంలో అరుణ్‌ రంగరాజులు తెలుగు, తమిళ భాషల్లో నిర్మించారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 3న తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్‌ చేయనున్నట్టు ప్రకటించి, తెలుగు టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్‌. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్‌ సంస్థ పీవీఆర్‌ ఐనాక్స్‌ పిక్చర్స్‌ ఈ మూవీ థియేట్రికల్‌ డిస్ట్రిబ్యూషన్‌లో భాగస్వామిగా ఉంది.

‘డబ్బు సంపాదించడానికి చాలా మార్గాలు ఉన్నాయి’ అంటూ సముద్ర ఖని చెప్పే డైలాగ్‌తో టీజర్‌ ప్రారంభం అవుతుంది. ‘రిచ్‌ కావాలంటే రిచ్‌ మనిషిలా ఖర్చు చేయడం నేర్చుకోవాలి. డబ్బు లేకపోతే అప్పు తీసుకుని ఖర్చు చేయాలి’ అంటూ సముద్ర ఖని చెప్పే డైలాగ్స్‌ కూడా టీజర్‌లో ఉన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement