అరడజనుకు పైగా సినిమాలతో వరసగా ఫ్లాప్స్ అందుకున్న హీరో రవితేజ.. ఈసారి సంక్రాంతికి 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' మూవీతో వచ్చాడు. కంటెంట్ పరంగా పర్లేదు అనిపించుకున్నప్పటికీ ఎందుకనో జనాలు దీన్ని చూసేందుకు పెద్దగా ఆసక్తి చూపించలేదు. ఈ చిత్రం ఫలితం సంగతి ఏంటనేది పక్కనబెడితే తాజాగా రవితేజ కొత్త మూవీని ప్రకటించాడు. 'ఇరుముడి' అనే టైటిల్ ఫిక్స్ చేసి, ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. అయితే ఈ చిత్రంపై రీమేక్ రూమర్స్ వినిపిస్తున్నాయి.
ట్రెండ్ ఎంత మారుతున్నా సరే రవితేజ ఎక్కువగా కమర్షియల్ సినిమాలే చేస్తూ వచ్చాడు. మధ్యలో 'ఈగల్', 'టైగర్ నాగేశ్వరరావు' లాంటి ఒకటి రెండు ప్రయోగాత్మాక మూవీస్ చేసినప్పటికీ.. వాటిలోనూ రెగ్యులర్ కమర్షియల్ సాంగ్స్, సీన్స్ ఉండేసరికి అవి ఫ్లాప్ అయ్యాయి. దీంతో ఇప్పుడు కాస్త ఆలోచించి భిన్నంగా 'ఇరుముడి' అనే మూవీని రవితేజ చేస్తున్నాడు. ఇందులో అయ్యప్ప మాలధారిగా కనిపించబోతున్నాడు. అయితే ఈ చిత్రాన్ని చాలామంది 2022లో వచ్చిన మలయాళ మూవీ 'మాలికాపురం' రీమేక్ అని అంటున్నారు. అందులోనూ ఇలానే హీరో అయ్యప్ప మాల వేసుకుని ఉంటాడు. కూడా ఇద్దరు పిల్లలు ఉంటారు. దీంతో ఈ రెండింటి మధ్య పోలికలు కనిపిస్తున్నాయి.
(ఇదీ చదవండి: ఓటీటీలో కార్తీ 'అన్నగారు వస్తారు' సినిమా.. డైరెక్ట్‌గా స్ట్రీమింగ్)
కొన్నిరోజుల క్రితం శివ నిర్వాణ.. రవితేజతో హారర్ థ్రిల్లర్ సినిమా చేయబోతున్నాడని రూమర్స్ వినిపించాయి. కానీ 'ఇరుముడి' టైటిల్, ఫస్ట్ లుక్ చూస్తే ఇదో కూతురు, దేవుడి సెంటిమెంట్ బ్యాక్ డ్రాప్ మూవీ అనిపిస్తుంది. ఈ క్రమంలోనే 'మాలికాపురం' రీమేక్ అని అంటున్నారు. ఈ మలయాళ సినిమా తెలుగులోనూ డబ్బింగ్ అయి ఓటీటీలోనూ అందుబాటులో ఉంది. అయితే 'ఇరుముడి' రీమేకా కాదా అనేది కొన్నిరోజుల ఆగితే క్లారిటీ వచ్చే అవకాశముంది.
'మాలికాపురం' విషయానికొస్తే.. ఎనిమిదేళ్ల పాప కల్యాణి, అయ్యప్పస్వామి భక్తురాలు. తండ్రితో కలిసి శబరిమల వెళ్లాలనేది ఈమె కల. అనుకోని పరిస్థితుల్లో తండ్రిని కోల్పోతుంది. దీంతో ఓ స్నేహితుడితో కలిసి శబరిమలకు బయలుదేరుతుంది. ఈ ప్రయాణంలో ఎదురయ్యే ప్రమాదాలు, కిడ్నాప్ ప్రయత్నాలు, చివరకు అయ్యప్పన్ అనే వ్యక్తి సాయంతో శబరిమల ఎలా చేరుకున్నారనేది మిగతా స్టోరీ.
(ఇదీ చదవండి: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు 'దేవర' నిర్మాత గుడ్‌న్యూస్)


