జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు శుభవార్త.. దేవర-2 ఉంటుందని నిర్మాత అధికారికంగా ప్రకటించారు. ఆపై సినిమా విడుదల గురించి కూడా తెలిపారు. సీక్వెల్ గురించి చాలా కాలంగా తారక్ అభిమానుల్లో ఉన్న సందేహం ఎట్టకేలకు తీరింది. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన దేవర (2024)లో విడుదలైంది. భాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను మెప్పించిన ఈ మూవీకి సీక్వెల్ ఉంటుందని క్లైమాక్స్‌లోనే దర్శకుడు ప్రకటించినా అధికారికంగా స్పష్టత రాలేదు. అయితే, తాజాగా ‘దేవర’ నిర్మాతల్లో ఒకరైన సుధాకర్ మిక్కిలినేని ఒక క్లారిటీ ఇచ్చేశారు.
నందిగామలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న నిర్మాత సుధాకర్‌కు దేవర-2 ఉంటుందా, లేదా? అనే ప్రశ్న ఎదురైంది. దీంతో ఆయన సమాధానం ఇచ్చారు. ‘దేవర- 2′ తప్పకుండా ఉంటుందని పేర్కొన్నారు. అయితే, ఈ ఏడాది మే నెల నుంచే షూటింగ్ ప్రారంభం కానుందన్నారు. 2027లో సినిమా విడుదల చేస్తామని అభిమానుల సాక్షిగా ప్రకటించారు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ పోస్ట్‌లు పెడుతున్నారు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ మూవీ షూటింగ్‌లో తారక్ బిజీగా ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ తర్వాత అంటే మే నుంచి దేవర-2కు డేట్లు కేటాయించే ఛాన్స్ ఉంది.
దేవర-1 విడుదల తర్వాత కొరటాల శివతో ఎన్టీఆర్ మళ్లీ కలవలేదు. దీంతో సీక్వెల్ లేదని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే కొరటాల కూడా వేరే హీరోలతో సినిమాలు చేసేందుకు కొన్ని కథలు రెడీ చేసుకున్నారు. ఇంతలో మళ్లీ తారక్ నుంచి పిలుపు రావడం జరిగింది. వారిద్దరి మధ్య కథ ఫైనల్ కావడంతోనే ఇప్పుడు అధికారికంగా ప్రకటన వచ్చేసిందని సమాచారం.
#DEVARA 2 Update 🚨🚨
• Shoot begins from May 2026
• Release planned for 2027
:- Producer #SudhakarMikkilineni#NTRpic.twitter.com/IDmpz5bVWD— Milagro Movies (@MilagroMovies) January 27, 2026


