ఈ వారం ఓటీటీల్లోకి చాలానే సినిమాలు రాబోతున్నాయి. ఛాంపియన్, సర్వంమాయ, పతంగ్, అన్నగారు వస్తారు తదితర చిత్రాలు స్ట్రీమింగ్ కానున్నాయి. వీటితో పాటు 'ధురందర్' కూడా ఓటీటీలోకి రానుందనే టాక్ నడుస్తోంది. వీటికి తోడు హాలీవుడ్ క్రేజీ మూవీ 'అనకొండ' ఇప్పుడు సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. ఇంతకీ ఏంటి విషయం? ఎందులో స్ట్రీమింగ్ అవుతోంది?
(ఇదీ చదవండి: తమిళ బ్లాక్‌బస్టర్ సినిమా.. ఓటీటీలో ఇప్పుడు తెలుగులో)
1997లో తొలిసారి వెండితెరపై 'అనకొండ' సినిమా వచ్చింది. అప్పట్లో ఇలాంటి పాములతో మూవీస్ ఎవరూ తీయలేదు. దీంతో ప్రపంచవ్యాప్తంగా జనాలు విరగబడి చూశారు. తెలుగులోనూ డబ్బింగ్ చేస్తే ఇక్కడ కూడా అద్భుతమైన హిట్‌గా నిలిచింది. దీని తర్వాత 2004లో ది హంట్ ఫర్ బ్లడ్ ఆర్కిడ్, 2008లో ఆఫ్ స్ప్రింగ్, 2009లో ట్రయల్ ఆఫ్ బ్లడ్, 2015లో లేక్ ప్లాసిడ్ అని మరో నాలుగు మూవీస్ కూడా వచ్చాయి. కమర్షియల్‌గా హిట్ అయ్యాయి గానీ కంటెంట్ పరంగా ఓకే ఓకే అనిపించుకున్నాయి.
దాదాపు పదేళ్ల విరామం తర్వాత గత నెలలో 'అనకొండ' పేరుతో లేటెస్ట్ మూవీ ఒకటి తీసుకొచ్చారు. తెలుగు డబ్బింగ్ కూడా రిలీజ్ చేశారు. కానీ ఇది ప్రేక్షకుల్ని పెద్దగా అలరించలేకపోయింది. దీంతో నెలయ్యేసరికి అద్దె విధానంలో అమెజాన్ ప్రైమ్‌లోకి తీసుకొచ్చేశారు. ప్రస్తుతం విదేశాల్లో ఇంగ్లీష్ వెర్షన్ స్ట్రీమింగ్ అవుతుండగా.. ఎల్లుండి (జనరి 29) నుంచి మన దగ్గర కూడా తెలుగు, తమిళ డబ్బింగ్ రూపంలోనూ ఓటీటీలో అందుబాటులోకి రానుందని తెలుస్తోంది.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 15 సినిమాలు.. ఆ నాలుగు స్పెషల్)


