‘సీతారామం, ఫ్యామిలీ స్టార్’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ సుపరిచితురాలే. అయితే మృణాల్ ఠాకూర్‌కు కోలీవుడ్ నుంచి కబురు వచ్చిందట. శింబు హీరోగా తమిళంలో ‘ఓ మై కడవులే, డ్రాగన్ (తెలుగులో ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ ’గా విడుదలైంది)’ వంటి సక్సెస్‌ఫుల్ సినిమాలకు దర్శకత్వం వహించిన అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఏజీఎస్ ఎంటర్‌టైన్ మెంట్ సంస్థ ఈ సినిమాను నిర్మించనుంది. కాగా ఈ సినిమాలోని హీరోయిన్ పాత్రకు మృణాల్ ఠాకూర్‌ను ఎంపిక చేసుకున్నారట చిత్రం యూనిట్. మృణాల్‌కు ఆల్రెడీ మేకర్స్ ఈ సినిమా కథ వినిపించారని, ఆమె ఈ సినిమాలో నటించేందుకు ఆల్మోస్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే టాక్ కోలీవుడ్‌లో వినిపిస్తోంది.
ఒకవేళ ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ నటించనున్న విషయం అధికారికంగా వెల్లడైతే, మృణాళ్‌కు తమిళ్‌లో ఇదే తొలి చిత్రం అవుతుంది. మరి..ఈ సినిమాతోనే మృణాల్ కోలీవుడ్ ఎంట్రీ జరుగుతుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న సినిమా, అడవి శేష్ హీరోగా చేస్తున్న ‘డెకాయిట్’ చిత్రాలతో మృణాల్ ఠాకూర్ బిజీగా ఉన్నారు. అలాగే ఆమె హిందీలో నటించిన ‘దో దీవానే షెహర్ మే’ చిత్రం ఈ ఫిబ్రవరి 20న థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. ఈ చిత్రాలే కాదు..మరికొన్ని హిందీ చిత్రాల్లోనూ ఆమె నటిస్తున్నారు.
ప్రియాంకా చోప్రా లైఫ్ జర్నీ నాకు స్ఫూర్తి: మృణాల్ ఠాకూర్
బాలీవుడ్ సక్సెస్‌ఫుల్ టాప్ హీరోయిన్ ప్రియాంకా లైఫ్ జర్నీ అంటే తనకు ఎంతో ఇష్టమని చెబుతున్నారు మృణాల్ ఠాకూర్. ఈ అంశంపై ఇటీవల ఆమె ఇంటర్వ్యూలో స్పందించారు. ‘‘సినీ ఇండస్ట్రీ బ్యాక్‌గ్రౌండ్ లేకుండ సినిమాల్లోకి వచ్చారు ప్రియాంకా చోప్రా ఎన్నో ఒడుదొడుకులను ఎదుర్కొని, కష్టపడి గ్లోబల్ రేంజ్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. అలాగే ప్రియాంక చోప్రా యువతకు ఇచ్చే సూచనలు, సలహాలు నాకు చాలా ఇష్టం. ఇలా ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచిన ప్రియాంకా చోప్రా నాకు కూడా స్ఫూర్తి. నా ప్రయాణం, ప్రియాంక చోప్రా ప్రయాణం పూర్తిగా భిన్నమైనవి. కానీ మా ఇద్దరి మధ్యలో ఓ కామన్ పాయింట్ ఉంది. ఇద్దరం కూడా కష్టకాలంలో ఎక్కడా వెనకడుగు వేయకుండా కృషి, పట్టుదలతో ముందుకు వెళ్తున్నాం’’ అని చెప్పారు మృణాల్.


