జరుగుతుందని..! | - | Sakshi
Sakshi News home page

జరుగుతుందని..!

Feb 1 2026 3:37 AM | Updated on Feb 1 2026 3:37 AM

జరుగు

జరుగుతుందని..!

ఇలాంటిదేదో

తమిళసినిమా: విజయ్‌ కథానాయకుడిగా నటించిన జననాయకన్‌. పూజా హెగ్డే కథానాయకిగా నటించిన ఇందులో మలయాళ బ్యూటీ మమిత బైజు కీలక పాత్ర పోషించారు. బాలీవుడ్‌ స్టార్‌ నటుడు బాబీ డియోల్‌ ప్రతి నాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని హెచ్‌.వినోద్‌ దర్శకత్వంలో కేవీఎన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మించింది. అనిరుధ్‌ సంగీతాన్ని అందించిన చిత్రం పొంగల్‌ సందర్భంగా ఈనెల 9వ తేదీన విడుదల కావల్సింది. అయితే సెన్సార్‌ సమస్యల కారణంగా ఇది కోర్టుల చుట్టూ తిరుగుతోంది. ఇలా గత నెల రోజులకు పైగా సెన్సార్‌ బోర్డ్‌, న్యాయస్థానాలు మధ్య వివాదాలు జరుగుతున్నా, సుమారు రూ. 500 కోట్లు పెట్టుబడి పెట్టిన నిర్మాత నలిగిపోతున్నా, రూ. 200 కోట్లకుకు పైగా పారితోషికం అందుకున్నట్లు ప్రచారం జరుగుతున్న ఆ చిత్ర కథానాయకుడు విజయ్‌ కానీ, దర్శకుడుహెచ్‌ .వినోద్‌ కానీ , తమకేమీ పట్టనట్లు నోరు మెదపటం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎట్టకేలకు నటుడు విజయ్‌ తొలిసారిగా జననాయకన్‌ వ్యవహారంపై నోరు విప్పారు. ఈయన ఇటీవల ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన భేటీలో చిత్రం నిర్మాతను తలుచుకుంటేనే తనకు బాధ కలుగుతోందని పేర్కొన్నారు. తాను రాజకీయ ప్రవేశం చేయడం వల్ల తనకు ఇలాంటిది ఏదో జరుగుతుందని ముందే ఊహించానన్నారు. అందుకు తాను మెంటల్‌గా సిద్ధం అయినట్లు నటుడు విజయ్‌ పేర్కొన్నారు.

జరుగుతుందని..! 1
1/1

జరుగుతుందని..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement