breaking news
45 movie
-
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 28 సినిమాలు
మరోవారం వచ్చేసింది. సంక్రాంతి రిలీజైన తెలుగు సినిమాల్లో చిరంజీవి, నవీన్ పొలిశెట్టి, శర్వానంద్ చిత్రాలు.. ప్రేక్షకుల్ని అలరిస్తున్నాయి. దీంతో ఎప్పటిలానే ఈ వారం కొత్త రిలీజులు ఏం లేవు. 'ఓం శాంతి శాంతి శాంతిః' అనే తెలుగు మూవీని 23వ తేదీన రిలీజ్ చేస్తామని చాన్నాళ్ల క్రితం ప్రకటించారు గానీ ప్రమోషన్స్ చేయట్లేదు. దీంతో వాయిదా కన్ఫర్మ్ అనిపిస్తుంది. మరోవైపు 'బోర్డర్ 2' అనే హిందీ చిత్రం ఇదే వీకెండ్ థియేటర్లలోకి రానుంది.(ఇదీ చదవండి: హ్యాట్రిక్ ఫ్లాప్స్ తర్వాత మెగా హీరో హారర్ మూవీ.. గ్లింప్స్ రిలీజ్)ఓటీటీల్లో అయితే 28 వరకు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఈ వారం స్ట్రీమింగ్ కానున్నాయి. శోభిత ధూళిపాళ్ల 'చీకటిలో' మూవీ ఆసక్తికరంగా అనిపిస్తోంది. దీంతో పాటు తేరే ఇష్క్ మైన్, మార్క్ అనే డబ్బింగ్ చిత్రాలు.. 45, సిరాయ్ అనే పరభాష సినిమాలు ఉన్నంతలో ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ఇంతకీ ఏ మూవీ ఏ ఓటీటీలోకి రానుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (జనవరి 19 నుంచి 25 వరకు)అమెజాన్ ప్రైమ్ప్రిపరేషన్ ఫర్ ద నెక్స్ట్ లైఫ్ (ఇంగ్లీష్ మూవీ) - జనవరి 19స్టీల్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 21చీకటిలో (తెలుగు సినిమా) - జనవరి 23ఇట్స్ నాట్ లైక్ దట్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 25నెట్ఫ్లిక్స్సండోకన్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 19జస్ట్ ఏ డ్యాష్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 20రిజోలి & ఐల్స్ సీజన్ 1-7 (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 20సింగిల్స్ ఇన్ఫెర్నో సీజన్ 5 (కొరియన్ సిరీస్) - జనవరి 20స్టార్ సెర్చ్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 20కిడ్నాపెడ్: ఎలిజిబెత్ స్మార్ట్ (ఇంగ్లీష్ సినిమా) - జనవరి 21క్వీర్ ఐ సీజన్ 10 (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 21కాస్మిక్ ప్రిన్సెస్ కగుయా (జపనీస్ సినిమా) - జనవరి 22ఫైండింగ్ హెర్ ఎడ్జ్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 22ఫ్రీ బెర్ట్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 22స్కై స్క్రాపర్ లైవ్ (ఇంగ్లీష్ సినిమా) - జనవరి 23తేరే ఇష్క్ మైన్ (తెలుగు డబ్బింగ్ చిత్రం) - జనవరి 23ద బిగ్ ఫేక్ (ఇటాలియన్ సినిమా) - జనవరి 23హాట్స్టార్ఏ నైట్ ఆఫ్ ద సెవెన్ కింగ్డమ్స్ సీజన్ 1 ఎపిసోడ్ 1 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జనవరి 19హిమ్ (ఇంగ్లీష్ సినిమా) - జనవరి 19మార్క్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - జనవరి 23స్పేస్ జెన్: చంద్రయాన్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 23ఆహాసల్లియర్గళ్ (తమిళ మూవీ) - జనవరి 20శంబాల (తెలుగు సినిమా) - జనవరి 22జీ545 (కన్నడ సినిమా) - జనవరి 23మస్తీ 4 (హిందీ మూవీ) - జనవరి 23సిరాయ్ (తమిళ సినిమా) - జనవరి 23కాళీపోట్కా (బెంగాలీ సిరీస్) - జనవరి 23ఆపిల్ టీవీ ప్లస్డ్రాప్ ఆఫ్ గాడ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 21ముబీలా గ్రేజియా (ఇటాలియన్ మూవీ) - జనవరి 23(ఇదీ చదవండి: నా మాటల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు: ఏఆర్ రెహమాన్) -
మల్టీస్టారర్ మూవీ.. నెలరోజుల్లోనే ఓటీటీలోకి..
కన్నడ స్టార్ హీరోలు శివరాజ్‌కుమార్, ఉపేంద్ర, రాజ్.బి శెట్టి ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం 45. సంగీత దర్శకుడు అర్జున్ జన్య దర్శకత్వం వహించిన ఈ మూవీ కన్నడలో డిసెంబర్ 25న విడుదలైంది. అయితే తెలుగులో మాత్రం కొత్త సంవత్సరం కానుకగా జనవరి 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా ఈ చిత్రం నెలరోజుల్లోనే ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. జీ5లో జనవరి 23న రిలీజ్ అవుతోంది. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది.కథవినయ్ (రాజ్. బి శెట్టి) ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి. ఓ రోజు అనుకోకుండా అతడి బైక్ ఢీ కొట్టి రోసీ అనే కుక్క చనిపోతుంది. ఆ కుక్క రాయప్ప(ఉపేంద్ర) అనే డాన్‌కు చెందినది. ప్రాణంగా చూసుకునే కుక్క చావుకు కారణమైన వినయ్‌ను 45 రోజుల్లో చంపాలనుకుంటాడు. అప్పటినుంచి అతడి జీవితం అయోమయంగా మారుతుంది. ఆ సమయంలో వినయ్ జీవితంలోకి శివ (శివ రాజ్‌కుమార్) వస్తాడు. అసలు ఈ శివ ఎవరు? రాయప్ప వినయ్‌ను చంపేశాడా? చివరకు ఏం జరిగిందనేది తెలియాలంటే 45 సినిమాను ఓటీటీలో చూడాల్సిందే! 45 The Biggest Movie Of 202545 Streaming On Jan 23rd In Kannada Zee5#45TheMovie #KannadaZEE5 #45OnZEE5 #ZEE5Cinemas #ZEE5 pic.twitter.com/uUFZWCE04Y— ZEE5 Kannada (@ZEE5Kannada) January 16, 2026 చదవండి: ది రాజాసాబ్ కలెక్షన్స్.. ఫస్ట్ వీక్ ఎంతంటే? -
‘45’ చూశాక ప్రతి ప్రాణిని ప్రేమిస్తారు : శివరాజ్ కుమార్
‘‘అర్జున్ జన్య చెప్పిన ‘45’ కథ నచ్చడంతో ‘మీరే డైరెక్ట్ చేయండి’ అని చెప్పాను. తనకు ఇచ్చిన అవకాశానికి పూర్తిగా న్యాయం చేశారు అర్జున్. ఈ మూవీ చూశాక ప్రతి ప్రాణిని ప్రేమిస్తారు... గౌరవిస్తారు. బతికినన్ని రోజులు హ్యాపీగా జీవించాలని మా చిత్రం చెబుతుంది’’ అని శివ రాజ్‌కుమార్ తెలిపారు. సంగీత దర్శకుడు అర్జున్ జన్య దర్శకత్వంలో శివ రాజ్‌కుమార్, ఉపేంద్ర, రాజ్ బి. శెట్టి ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘45’. ఉమా రమేశ్ రెడ్డి, ఎం. రమేశ్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం మైత్రీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా జనవరి 1న విడుదల కానుంది. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఉపేంద్ర మాట్లాడుతూ– ‘‘ఇప్పటివరకూ ఎవ్వరూ ఇవ్వని పాత్రను నాకు ఈ సినిమాలో అర్జున్ ఇచ్చారు. స్క్రీన్‌ప్లేని చాలా గ్రిప్పింగ్‌గా రాశారు అర్జున్. మంచి చిత్రాలను ఆదరించే తెలుగు ప్రేక్షకులు మా ‘45’ని కూడా సపోర్ట్ చేయాలి’’ అని చెప్పారు. ‘‘45’లో ఓ కొత్త ప్రపంచాన్ని చూడబోతున్నారు’’ అన్నారు అర్జున్ జన్య ‘‘గరుడ పురాణం గురించి చాలా గొప్పగా చెప్పే చిత్రమిది’’ అని రమేశ్ రెడ్డి తెలిపారు. ‘‘మంచి సందేశాన్ని ఇచ్చేలా ఈ చిత్రం ఉంటుంది’’ అన్నారు మైత్రీ శశి. -
శివరాజ్ కుమార్ యాక్షన్ మూవీ.. తెలుగు ట్రైలర్ వచ్చేసింది..!
కన్నడ స్టార్స్ శివ రాజ్‌కుమార్, ఉపేంద్ర ప్రధాన పాత్రల్లో వస్తోన్న యాక్షన్ థ్రిల్లర్ 45. ఈ మూవీకి అర్జున్ జన్యా దర్శకత్వం వహించారు. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలోనే 45 మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. 'అక్కడ సమాధి చూస్తున్నావ్ కదా.. ఆ సమాధి మధ్య మనిషి పుట్టిన తేదీ.. మరణించిన తేదీ రాసుంటుంది..ఆ మధ్య ఉన్న చిన్న డ్యాషే మనిషి మొత్తం జీవితం' అనే డైలాగ్‌లో ఈ ట్రైలర్‌తో ప్రారంభమైంది. ఈ ట్రైలర్ విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. ఫైట్స్, విజువల్స్ చూస్తుంటే ఫుల్ యాక్షన్ మూవీగానే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ మూవీలో రాజ్ బి శెట్టి కీలక పాత్రలో నటించారు. ఇంకెందుకు ఆలస్యం తెలుగు ట్రైలర్ మీరు కూడా చూసేయండి. -
‘ఆఫ్రో తపాంగ్’ సాంగ్ రిలీజ్.. శివన్న, ఉపేంద్ర మాస్ డ్యాన్స్ వైరల్!
కన్నడ సూపర్ స్టార్స్ శివరాజ్ కుమార్(Shivarajkumar), ఉపేంద్ర(Upendra), రాజ్ బి శెట్టి(Raj B.Shetty) ప్రధాన పాత్రల్లో భారీ మల్టీ-స్టారర్ ఫాంటసీ యాక్షన్ ఫిల్మ్ '45' (45 The Movie) తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సూరజ్ ప్రొడక్షన్ బ్యానర్ పై శ్రీమతి. ఉమా రమేష్ రెడ్డి, ఎం రమేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు అర్జున్ జన్యా ఈ చిత్రంతో దర్శకుడిగా మారుతున్నారు. భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కిన ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ 25న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి 'ఆఫ్రో తపాంగ్' పాటని విడుదల చేశారు. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అందించిన ఈ పాటకి ఉపేంద్ర, శివన్నలతో పాటు రాజ్ బి శెట్టి కూడా అదిరిపోయే స్టెప్పులేశారు. శివన్న యాక్షన్ ఫ్లెయిర్‌తో, ఉప్పి స్టైలిష్ ట్విస్ట్‌లతో, రాజ్ బి. శెట్టి ఎనర్జీతో హుక్ స్టెప్స్ ఆకట్టుకుంటున్నాయి. నవంబర్ 1న ఈ పాటను విడుదల చేయగా.. కొన్ని గంటల్లోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది. యూట్యూబ్‌లో ఇప్పటికే 25 లక్షలకు పైగా వ్యూస్‌తో దూసుకెళ్తుంది. చాలాకాలం తర్వాత శివరాజ్‌కుమార్, ఉపేంద్రల మాస్ డ్యాన్స్ చూసి అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శాండల్‌వుడ్‌లో బిగ్గెస్ట్ మల్టీ-స్టారర్ పాటల్లో ఒకటిగా ‘ఆఫ్రో తపాంగ్’ నిచిలిపోతుందని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.


