‘ఆఫ్రో తపాంగ్’ సాంగ్‌ రిలీజ్‌.. శివన్న, ఉపేంద్ర మాస్‌ డ్యాన్స్‌ వైరల్‌! | Afro Tapaang Video Song Out From 45 Movie, Upendra, Shivarajkumar Dance Goes Viral On Social Media | Sakshi
Sakshi News home page

జానీ మాస్టర్‌ ‘ఆఫ్రో తపాంగ్’ సాంగ్‌ రిలీజ్‌.. శివన్న, ఉపేంద్ర మాస్‌ డ్యాన్స్‌ వైరల్‌!

Nov 2 2025 11:28 AM | Updated on Nov 2 2025 12:10 PM

Afro Tapaang Video Song Out From 45 Movie, Upendra, Shivarajkumar Dance Goes Viral

కన్నడ సూపర్ స్టార్స్ శివరాజ్కుమార్(Shivarajkumar)‌, ఉపేంద్ర(Upendra), రాజ్బి శెట్టి(Raj B.Shetty) ప్రధాన పాత్రల్లో భారీ మల్టీ-స్టారర్ ఫాంటసీ యాక్షన్ ఫిల్మ్ '45' (45 The Movie) తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సూరజ్ ప్రొడక్షన్ బ్యానర్ పై శ్రీమతి. ఉమా రమేష్ రెడ్డి, ఎం రమేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు అర్జున్ జన్యా ఈ చిత్రంతో దర్శకుడిగా మారుతున్నారు. భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కిన ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్‌ 25న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి 'ఆఫ్రో తపాంగ్' పాటని విడుదల చేశారు.  

జానీ మాస్టర్‌ కొరియోగ్రఫీ అందించిన ఈ పాటకి  ఉపేంద్ర, శివన్నలతో పాటు రాజ్‌ బి శెట్టి కూడా అదిరిపోయే స్టెప్పులేశారు. శివన్న యాక్షన్ ఫ్లెయిర్‌తో, ఉప్పి స్టైలిష్ ట్విస్ట్‌లతో, రాజ్ బి. శెట్టి ఎనర్జీతో హుక్ స్టెప్స్ ఆకట్టుకుంటున్నాయి. నవంబర్‌ 1న ఈ పాటను విడుదల చేయగా.. కొన్ని గంటల్లోనే సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిపోయింది. యూట్యూబ్‌లో ఇప్పటికే 25 లక్షలకు పైగా వ్యూస్‌తో దూసుకెళ్తుంది.  చాలాకాలం తర్వాత శివరాజ్‌కుమార్‌, ఉపేంద్రల మాస్‌ డ్యాన్స్‌ చూసి అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శాండల్‌వుడ్‌లో బిగ్గెస్ట్ మల్టీ-స్టారర్ పాటల్లో ఒకటిగా ‘ఆఫ్రో తపాంగ్‌’ నిచిలిపోతుందని నెటిజన్స్‌ కామెంట్‌ చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement