టాలీవుడ్ హీరో సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తోన్న లేటేస్ట్ కోలీవుడ్ మూవీ సిగ్మా. ఈ చిత్రంతో దళపతి తనయుడు జాసన్ సంజయ్ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తున్నారు. ఈ మూవీని యాక్షన్ కామెడీ అడ్వెంచర్‌గా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌లో సుభాస్కరన్ నిర్మిస్తున్నారు.
తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ చూస్తుంటే కామెడీ యాక్షన్‌తో పాటు అడ్వెంచరస్‌గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇందులో ఫైట్ సీన్స్, విజువల్స్ ఈ సినిమాపై అంచనాలు మరించ పెంచుతున్నాయి. ఈ సినిమా వచ్చే ఏడాది తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతమందిస్తున్నారు. ఈ చిత్రంలో రాజు సుందరం, సంపత్ రాజ్, శివ్ పండిట్, అన్బు థాసన్, యోగ్ జాపీ, మగలక్ష్మి, షీలా రాజ్‌కుమార్, కమలేష్, కిరణ్ కొండా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.


