నన్ను అలా అన్నందుకు బాధలేదు.. కానీ..: అమితాబ్ బచ్చన్‌ | Amitabh Bachchan Reacts On film festival exprerience in another country | Sakshi
Sakshi News home page

Amitabh Bachchan: అలా అన్నందుకు చాలా బాధేసింది: అమితాబ్ బచ్చన్‌

Feb 8 2026 8:46 AM | Updated on Feb 8 2026 10:33 AM

Amitabh Bachchan Reacts On film festival exprerience in another country

బాలీవుడ్‌ బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌  ఆసక్తికర కామెంట్స్ చేశారు. మనదేశాన్ని ఓ విదేశీ జర్నలిస్ట్ ‍అలా అని పిలవడం చాలా బాధగా అనిపించిందని అన్నారు. ఓ ఫిల్మ్ ఫెస్టివల్‌కు వెళ్లినప్పుడు ఈ సంఘటన జరిగిందని గుర్తు చేసుకున్నారు. ఒక దేశంలో ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరైనప్పుడు అక్కడి స్థానిక అభిమానుల నుండి తనకు ఊహించని రెస్పాన్స్ వచ్చిందని అన్నారు. విమానంలో ఒక్కసారిగా అభిమానులు చుట్టుముట్టారని తెలిపారు. ఆ సమయంలో పోలీసులు తనను జాగ్రత్తగా హోటల్‌కు తీసుకెళ్లారని వెల్లడించారు.  ఇటీవల టీమ్‌ఇండియా అండర్-19 వరల్డ్ కప్ గెలిచిన సందర్భంగా తనకెదురైన చేదు అనుభవాన్ని పంచుకున్నారు.

అమితాబ్ మాట్లాడుతూ.. "ఒక దేశం నన్ను ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఆహ్వానించింది(ఆ దేశం పేరు వెల్లడించను). దీనికి నేను వెళ్లడానికి అంగీకరించా. ఆ దేశానికి వెళ్లినప్పుడు విమానంలో ఓ వార్తాపత్రికను చూశా. అందులో నా సినిమాలలో ఒక చిత్రం ఉంది. ఆ దేశ భాష అర్థం కాక అందులో ఏమి రాశారని నేను ఎయిర్ హోస్టెస్‌ను అడిగా. అది ఒక భారతీయ సినిమా పోస్టర్ అని.. ఆ దేశానికి చెందిన నటుడు ఇక్కడికి వస్తున్నాడని పత్రికలో రాశారని ఆమె చెప్పింది" అని అన్నారు. అయితే విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత వెంటనే అక్కడ తనను అభిమానుల గుంపు చుట్టుముట్టడంతో ఆశ్చర్యపోయానని వెల్లడించారు.

ఆ తర్వాత మాట్లాడుతూ.. "ఈ దేశంలో మన సినిమాల పట్ల  ఉన్న క్రేజ్ చూసి ఆశ్చర్యపోయా. విమానం దిగిన తర్వాత అసలు విషయం తెలిసింది. ఎయిర్‌పోర్ట్‌లో ఇమ్మిగ్రేషన్ డెస్క్ వరకు వెళ్లడానికి కూడా ఇబ్బంది పడ్డా. పరిస్థితి ఎంత గందరగోళంగా మారిందంటే పోలీసులు వచ్చి నన్ను కారులో ఎక్కించి నా హోటల్‌కు తీసుకుని వెళ్లారు. నా జీవితంలో మొదటిసారిగా నా ఇమ్మిగ్రేషన్ హోటల్లో జరిగిందని' అమితాబ్ బచ్చన్ గుర్తు చేసుకున్నారు.

విదేశీ జర్నలిస్ట్ కామెంట్స్‌..

అయితే తనకు ఆత్మీయ స్వాగతం లభించినప్పటికీ.. ఓ విదేశీ జర్నలిస్ట్‌ తనపై రాసిన కథనం చూసి బాధపడ్డానని తెలిపారు. మూడవ ప్రపంచ దేశానికి చెందిన ఈ మూడో రకం నటుడికి ఇంత ప్రాముఖ్యత ఎందుకు ఇస్తున్నారని కథనంలో రాసుకొచ్చాడని వెల్లడించారు. అయితే తనను మూడో రకం నటుడు అన్నందుకు బాధలేదని.. నా భారతదేశాన్ని మూడవ ప్రపంచ దేశం అని పిలవడం బాధ కలిగించిందని తెలిపారు.

అందుకే తాజాగా తనకెదురైన అనుభవాన్ని క్రికెట్‌తో ముడిపెట్టి ట్వీట్ చేశారు. అండర్-19 క్రికెట్ ఇండియా.. ప్రపంచ ఛాంపియన్స్‌గా నిలిచారు. ఇప్పుడు ప్రపంచ ఛాంపియన్లుగా వరల్డ్‌లోనే మొదటి స్థానంలో ఉన్నాం.. మనం మూడో ప్రపంచం కాదు.. మనం మొదటి ప్రపంచం.. భారత్‌ మాతా కీ జై అంటూ పోస్ట్ చేశారు. అంధులు, స్త్రీలు, పురుషులు, ఇప్పుడు 19ఏళ్ల వయస్సు క్రికెటర్స్ కూడా ఈ విషయాన్ని  నిరూపించారని ట్విటర్‌లో పంచుకున్నారు. కాగా.. ఇటీవల జరిగిన ఐసీసీ అండర్-19 పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్‌లో భారత జట్టు ఇంగ్లాండ్‌ను 100 పరుగుల తేడాతో ఓడించింది.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement