టాలీవుడ్ సినీయర్ నటుడు శివాజీకి బిగ్ షాక్ తగిలింది. హీరోయిన్ల దుస్తులను ఉద్దేశించి ఆయన చేసిన కామెంట్స్‌పై మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తాను చేసిన కామెంట్స్‌పై వివరణ కోరుతూ శివాజీకి మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. శివాజీ మాట్లాడిన మాటలను తెలంగాణ మహిళా కమిషన్ లీగల్ టీమ్ పరిశీలించిందని చైర్‌పర్సన్ నేరెళ్ల శారద వెల్లడించారు.
శివాజీ మహిళలపై చేసిన వ్యాఖ్యలపై యాక్షన్ తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. సినీ నటులు మహిళల గురించి మాట్లాడే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఎవరైనా సరే మహిళల గురించి అవమానకరంగా, అసభ్యంగా మాట్లాడితే కఠిన చర్యలు తప్పవని తెలంగాణ మహిళా కమిషన్ ఛైర్మన్ నేరెళ్ల శారద వార్నింగ్ ఇచ్చారు.
సామాన్లు అంటూ కామెంట్స్..
కాగా.. దండోరా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరైన శివాజీ హీరోయిన్లు డ్రెస్‌లను ఉద్దేశించి మాట్లాడారు. దుస్తుల విషయాన్ని చెబుతూ కొన్ని అసభ్యకరమైన పదాలు వాడారు. సామాన్లు అంటూ వెటకారంగా కామెంట్స్ చేశారు. దీనిపై ఇప్పటికే అనసూయతో పాటు చిన్మయి శ్రీపాద సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. శివాజీ కామెంట్స్‌పై టాలీవుడ్ హీరో మంచు మనోజ్ సైతం క్షమాపణలు చెప్పారు. ఈ టాపిక్ ప్రస్తుతం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.


