టాలీవుడ్ నటుడు శివాజీ క్షమాపణలు కోరారు. మహిళల దుస్తులను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలపై సారీ చెప్పారు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చేసిన కామెంట్స్ ఉద్దేశపూర్వకంగా చేయలేదని క్లారిటీ ఇచ్చారు. ఆ రెండు మాటలు అనకుండా ఉండాల్సిందని పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. సారీ చెబుతూ ట్విటర్ వేదికగా వీడియోను రిలీజ్ చేశాడు.
వీడియోలో శివాజీ మాట్లాడుతూ.. 'హలో అండి.. నిన్న సాయంత్రం దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరోయిన్స్ ఈ మధ్య కాలంలో ఇబ్బందులు పడిన సందర్భంలో నాలుగు మంచి మాటలు చెబుతూనే రెండు అన్‌పార్లమెంటరీ పదాలు వాడాను. నేను మాట్లాడింది అందరు అమ్మాయిల గురించి కాదు.. హీరోయిన్స్ బయటికి వెళ్లినప్పుడు దస్తులు బాగుంటే మంచిదనే ఉద్దేశం. ఏదేమైనా రెండు పదాలు వాడకుండా ఉండాల్సింది. స్త్రీ అంటే మహాశక్తి. ఒక అమ్మవారిలా అనుకుంటా. ఈ కాలంలో స్త్రీని ఎంత తక్కువగా చూస్తున్నారో మనం చూస్తున్నాం. ఆ విషయం చెప్పాలనే ఉద్దేశంతో ఒక ఊరి భాష మాట్లాడాను. అది చాలా తప్పు. నా ఉద్దేశం మంచిదే కానీ.. ఆ రెండు పదాలు దొర్లకుండా ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. నాకు మంచి ఉద్దేశమే తప్ప.. అవమానపరచాలి.. కించపరచాలి అనే ఉద్దేశం లేదు. ఇండస్ట్రీలో ఆడవాళ్ల మనోభావాలు దెబ్బతిన్నందుకు.. అలాగే మహిళలు తప్పుగా భావిస్తే మీ అందరికీ నా క్షమాపణలు' అంటూ వీడియోలో కోరాడు.
I sincerely apologise for my words during the Dhandoraa pre-release event last night.@itsmaatelugu pic.twitter.com/8zDPaClqWT
— Sivaji (@ActorSivaji) December 23, 2025


